
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద ఏపీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్తుండగా ట్రైన్ S6 బోగీ వద్ద బ్రెక్ జామ్ కావడంతో ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలిపివేశారు. భయంతో ప్రయాణికులు ట్రైన్ దిగారు.
అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలు చెలరేగకుండా రైల్వే సిబ్బంది పొగలను అదుపులోకి తెచ్చారు. బ్రేక్ ప్యాడ్స్ జామ్ కావడంతో పొగలు వచ్చినట్లు నిర్ధారించారు. స్టేషన్‌లో రెండు లైన్లలో ట్రెయిన్లు ఆగడంతో అరగంటసేపు రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో వచ్చిన పొగలను అదుపు చేసిన అనంతరం ట్రైన్ న్యూఢిల్లీ వెళ్ళిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment