రైల్వేలో రూపాయి అవినీతికీ తావివ్వం
సాక్షి, హైదరాబాద్: రైల్వేశాఖలో ఒక్క రూపా యి అవినీతికి కూడా తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. రైల్వేను గొప్ప సంస్థగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఉద్యోగులు బాసటగా నిలవాలని కోరా రు. సోమవారం ఉదయం ఆయన సికింద్రాబాద్ స్టేషన్‌లో హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (డైలీ), కాజీపేట-ముంబై తడోబా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)లను, నిజామాబాద్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రెండు లిఫ్టులను రిమోట్ ద్వారా ప్రారంభించారు. హైదరాబాద్ శివారులోని నాగులపల్లి స్టేషన్-ఢిల్లీలోని తుగ్లకాబాద్ మధ్య కార్గో ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)ను సికింద్రాబాద్ స్టేషన్ నుంచే ప్రారంభించారు.
అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రైల్వేకు విపరీతంగా పెరుగుతున్న నిర్వహణ వ్యయం పెద్ద సమస్యగా మారింది. ఈ దశలో ఖర్చును నియంత్రించే చర్యలు చేపట్టడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిం చాలి. అందుకే సంస్కరణల దిశగా సాగుతున్నాం’’ అని అన్నారు. తాను ఇక దక్షిణాదిలో రైల్వే విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. రైల్వే స్థలాల్లో ఉన్న చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరించి ఆ నీటిని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ పొదుపు చర్యల వల్ల ఇటీవల రూ. 3,500 కోట్ల పొదుపు సాధ్యమైందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలిచే క్రమంలో నాగులపల్లి, చర్లపల్లి స్టేషన్‌లలో భారీ హరిత టెర్మినళ్లను నిర్మించనున్నట్లు ప్రభు చెప్పారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రులు హన్సరాజ్ గంగారామ్ అహిర్, బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయి ని నర్సింహారెడ్డి మహేందర్‌రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
రైల్వేకు స్వర్ణయుగం తేవాలి
అంతకుముందురైల్ కళారంగ్‌లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవాల్లో సురేశ్ ప్రభు పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల విషయంలో ఉద్యోగులు చూపే ఉత్సాహాన్ని రైల్వే కు స్వర్ణయుగం తేవటంలోనూ చూపాలన్నా రు. కార్యక్రమంలో రైల్వే మజ్దూర్ యూని యన్ ప్రతినిధులు శివగోపాల్ మిశ్రా, శంకరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నిరసన నినాదాలతో హోరెత్తించారు.