
న్యూఢిల్లీ: ఎక్కువ దూరం ప్రయాణించే దాదాపు 500 రైళ్ల ప్రయాణ సమయాన్ని వచ్చే నెల నుంచి సరాసరి దాదాపు 15 నిమిషాల నుంచి 2 గంటల వరకూ తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. రైల్వే మంత్రి ఆదేశాల మేరకు ఈ కొత్త టైం టేబుల్‌ను నవంబర్ నుంచి అమలు చేయనున్నారు.
కొత్త టైం టేబుల్ అమల్లోకి వచ్చిన వెంటనే 51 రైళ్ల ప్రయాణ సమయం గంట నుంచి 3 గంటల వరకూ తగ్గుతుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. దీన్ని క్రమంగా 500 రైళ్లకు పెంచుతామని చెప్పారు. రైళ్ల వేగం పెంపులో భాగంగా 50 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ సర్వీసుగా మార్చుతామని ఆయన పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment