
సాక్షి, విశాఖపట్నం: విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న రైలులో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు..పలు మార్లు తాకడానికి ప్రయత్నించడంతో అలెర్ట్ అయిన బాధితురాలు ప్రతిఘటించింది. దీంతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు నిందితుడిని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం ఓ విద్యార్ధిని విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లేందుకు ఓ రైలు ఎక్కింది. రాత్రి పూట కావడంతో నిద్రలోకి జారుకుంది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కదులుతున్న రైల్లో రెచ్చిపోయిన నిందితుడు విద్యార్ధినిని లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పలుమార్లు ఆమెను అసభ్యంగా తాకేందుకు యత్నించాడు.
దీంతో నిద్రలో ఉన్న విద్యార్ధిని అతడిని నుంచి తప్పించుకుంది. గట్టిగా కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు. తెల్లవారుజామున ఐదున్నర గంటలకు నిందితుడ్ని రైల్వే పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment