'తనకు ప్రత్యేక హోదా కోసం బాబు యత్నాలు'
గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా బంద్ నిర్వహిస్తామని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ 29న చేపట్టే బంద్కు వామపక్షాలు మద్ధతు తెలుపుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం కాకుండా ఆయన హోదా కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీహార్కు లక్షన్నర కోట్ల రూపాయల ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలని అక్కడి సీఎం నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారని గుర్తుచేశారు. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా చంద్రబాబు మాత్రం ప్యాకేజీ కావాలని కేంద్రం ముందు మోకరిల్లారని బొత్స విమర్శించారు.