సాక్షి, అమరావతి: ఏపీలో ఏడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, కౌంటింగ్ నేపథ్యంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌కు దిగారు. ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన మెజార్టీ లేకపోయినా గెలుపుపై సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.
కాగా, టీడీపీ నేతల ఓవరాక్షన్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు మాట్లాడే ప్రతి పనికిమాలిన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుకి ఏడు ఎమ్మెల్సీలను మేమే గెలుస్తాం. గంటా మాటలు గొప్పలు చెప్పుకోవడానికే. రాజీనామా ఆమోదిస్తే స్పీకర్ చెబుతారు కదా. గంటా అతని పబ్లిసిటీ కోసం చెప్పుకుంటే మేమెందుకు సమాధానం చెప్పాలి. టీడీపీ నేతలకు నిలకడ లేదు.
Comments
Please login to add a commentAdd a comment