సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబులో ఒరిజినాలిటీ లేదు.. మా పథకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, మంత్రి బొత్స సత్యానారాయణ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. పేదలకు పథకాలు అందకుండా చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు. కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబులో అసహనం పెరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ తాను గెలిస్తే చాలు అనుకుంటున్నాడు. మాది కుటంబ పార్టీ అయితే చంద్రబాబుది కుటంబ పార్టీ కాదా?.
చంద్రబాబు కుటుంబం తరఫున ఐదు మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రం ఏమైనా చంద్రబాబుకు పోటీ చేయడానికి రాసి ఇచ్చారా?. ప్రతిపక్ష పార్టీ నేతలుగా మేము పోరాటాలు చేసి గెలుస్తున్నాము. లోకేష్ లాగా అడ్డదారిలో తాము పదవులు పొందలేదు. ప్రధాన మంత్రిని విమర్శించడానికి నా స్థాయి సరిపోదా?. లోకేష్ స్థాయి సీఎం జగన్ విమర్శించేందుకు సరిపోతుందా?. నేను ఎంపీగా చేశాను మంచిగా పని చేశాను. ఒక శుంఠ సీఎం గురించి మాట్లాడినప్పుడు నేను ప్రధాని గురించి మాట్లాడితే తప్పేంటి?.
టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సర్వేలను నేను నమ్మను. మా ముఖ్యమంత్రి టార్గెట్ 175కు 175. చంద్రబాబులో ఒరిజినాలిటీ పోయింది. మా పథకాలన్నీ కాపీ కొడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఉద్యోగులకు మేలు చేసింది. గతంలో ఉద్యోగులకు టీడీపీ ఏమైనా మేలు చేసిందా?’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment