కృష్ణాజిల్లా గుడివాడలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇలపర్రు చేపలచెరువు భూములను ఎస్సీలకు పంచాలని కోరుతూ సోమవారం గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముట్టడికి సీపీఎం, సీపీఐ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్షం నాయకులు నినాదాలు చేశారు.