చింతలపూడి, న్యూస్‌లైన్ : చింతలపూడిలో వెలుగు చూసిన ఫోర్జరీ కేసుపై సమగ్ర దర్యాప్తు చే యనున్నట్లు ఏలూరు ఆర్డీవో కె.నాగేశ్వరరావు తెలిపారు. చింతలపూడి మండలం యర్రంపల్లి పంచాయతీ కార్యదర్శి ఎస్‌కే లాల్ అహ్మద్ రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి పట్టాలు, పాస్‌బుక్కులు, టైటిల్ డీడ్‌లు తయారుచేసి అమ్ముకుంటున్న కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టేందుకు గురువారం చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆర్డీవో ఎస్సై బి.మోహన్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ఇంట్లో లభించిన రెవెన్యూ రికార్డులు, నకిలీ స్టాంపులు, నకిలీ పాస్ పుస్తకాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇది జిల్లాలోనే పెద్ద ఫోర్జరీ కేసని, రెవెన్యూ శాఖ ప్రతిష్టకు సంబంధించిందన్నారు. జిల్లా అధికారులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. నిందితునికి సహకరించిన వ్యక్తులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. లాల్ అహ్మద్ నుంచి లబ్ధి పొందినవారు వెంటనే నకిలీ పత్రాలు అందజేస్తే వారిపై క్రిమినల్ కేసులు ఉండవని హామీ ఇచ్చారు. సమైక్యాంధ్ర సమ్మె ముగిసిన తర్వాత నకిలీ పత్రాలపై గ్రామాల్లో బహిరంగ విచారణ చేపడతామని, అప్పుడు బయటపడితే కేసులు తప్పవని ఆర్డీవో నాగేశ్వర రావు హెచ్చరించారు.
ఫోర్జరీ కేసుపై సమగ్ర దర్యాప్తు
Published Fri, Aug 30 2013 1:29 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement
Advertisement