కనీస వేతనాలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలన్న ప్రధాన డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. సుమారు ఐదు గంటలపాటు కార్యాలయం ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి ఓబులు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు మారిన మనిషనని చెప్పుకున్నా... ఆయన మారని మనిషే అని ఇప్పుడు నిరూపించుకుంటున్నారని విమర్శించారు.
అనంతపురం అర్బన్ : ‘నేను మారిన మనిషినని.. అంగన్‌వాడీని బలోపేతం చేస్తా.. మీ కష్టాల్లో పాలుపంచుకుంటా’ అని ఎన్నికల్లో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబా బు మిహ ళలను మోసం చేశారని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఓబులు విమర్శించా రు. కనీవ వేతనాలు, రాజకీయ వేధింపులు, తదితర డిమాండ్లపై సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్థానిక ఆర్డీవో కా ర్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. సీఎం డౌన్.. డౌన్.. ము ఖ్యంత్రికి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మండుటెండలో దాదాపు నాలుగు గంటలపాటు మహిళలు బైఠాయించారు. ముట్టడిని ఉద్దేశించి ఓబు లు మాట్లాడుతూ రాష్ర్ట ఆర్థిక బడ్జెట్‌లో అంగన్‌వాడీ కార్యకర్తల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఎన్నటికీ మారరని ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేసినవారిపై గుర్రాలతో తొక్కించాడు.. వాటర్ క్యాన్లు విసిరించాడని చంద్రబాబు పాలనలో సా గిన అరాచకాన్ని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఐసీడీఎస్ ప్రాజెక్టును బలోపేతం చేస్తామంటూనే ప్రధాని నరేం ద్రమోదీ బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించారన్నారు. గత ప్రభుత్వం ఐసీడీఎస్ కు రూ. 16 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిం చగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అందులో సగానికి తగ్గించి కేవలం రూ.8 వేల కోట్లను మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు.
ముట్టడికి యత్నం... పలువురి అరెస్టు : డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐ గోరంట్ల మాధవ్ నేతృత్వంలో ఒక్కసారిగా పోలీస్ బలగాలు ఓబుల, ఇంతియాజ్, నల్లప్పతో పాటు మరికొంతమంది సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేయబోయారు. దీంతో పోలీసులకు, సీఐటీయూ నాయకులకు తీవ్ర తోపులాట జరిగింది. ఓబుల ప్రతిఘటించినప్పటికీ పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించా రు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, కార్యదర్శి సావిత్రమ్మలను మహిళ పోలీసు లు అరెస్ట్ చేయడానికి రాగానే మహిళలు వారిని చుట్టముట్టారు.
జైలుకు వెళ్లాడానికై న సిద్ధంగా ఉన్నాం.. అంటూ.. తీవ్ర స్థాయి లో పోలీస్ చర్యలకు నిరసన వ్యక్తం చేశారు. పట్టువదలని అంగన్‌వాడీ ఉద్యోగులు ఆర్డీ ఓ కార్యాలయం ముట్టడికి యత్నించారు. లక్ష్మిదేవి, సావిత్రమ్మ, సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్నిపోశారు. ఆడపిల్లలులేని ఆయనకు తమ కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. లేకపోతే సరైన గుణపాఠం నేర్పుతామని శాపనార్థాలు పెట్టారు. ఈ నెల 17నరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.
బాబు మారని మనిషి
Published Sat, Mar 14 2015 2:47 AM | Last Updated on Fri, Aug 17 2018 5:18 PM
Advertisement
Advertisement