- ఆర్డీఓ కార్యాలయూన్ని ముట్టడించిన సీపీఐ నేతలు
- 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు
కామారెడ్డి : భూ సేకరణ చట్టాన్ని సవరించొద్దని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్‌భరోలో భాగంగా ఆపార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జైల్‌భరోలో పాల్గొన్న 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు వీఎల్ నర్సింహారెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.బాల్‌రాజులు మాట్లాడుతూ..ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న భూ సేకరణ చట్టా న్ని మోడీ ప్రభుత్వం సవరించడం సరికాదన్నారు. ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాల్‌రాజు, దశరథ్, భానుప్రసాద్, నర్సింలు, రాజశేఖర్, మల్లేశ్, మల్లయ్య, ఖాసీం, రాజాగౌడ్, అరుణ్, సుధీర్, సంతోష్, ప్రవీన్, శ్రీను పాల్గొన్నారు.
మన భూమిపై మన హక్కు
వినాయక్ నగర్ : మన భూమిపై మన హక్కు నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్ భరో విజయవంతమైంది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సేకరణ బిల్లు పేద రైతులను రోడ్డు పాలు చేసేలా ఉందని ఆరోపిం చారు. అంతకు ముందు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి భారీ ర్యాలీగా బస్టాండ్‌కు చేరుకున్నారు. రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర నాయకురాలు ప్రేమ పావని మాట్లాడుతూ... ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సేకరణ బిల్లు కార్పోరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా ఉందన్నారు. భూ సేకరణ చట్టంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామ సభల అంగీకారం మేరకే భూమి సేకరించాలని ఉందని తెలిపారు. అంతేకాకుండా మార్కెట్ రేటు కంటే నాలుగు రేట్లు అధికంగా ధర చెల్లించి వారికి పునరావాసం కల్పించాలని అన్నారు. కానీ, ప్రస్తుతం ప్రవేశపెడుతున్న భూ సేకరణ బిలు వీటన్నింటికి విరుద్దంగా ఉందని మండిపడ్డారు. రాస్తారోకో వద్దకు ఒకటో టౌన్ పోలీసులు చేరుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. ఏఐటీయూసీ నాయకులు బోసు బాబు, వెంకట్‌రెడ్డి, ఓమయ్య, సుధాకర్ పాల్గొన్నారు.
‘భూ సేకరణ’వద్దే వద్దు
Published Fri, May 15 2015 5:33 AM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM
Advertisement
Advertisement