ప్రణాళికాబద్ధంగా సాగునీటి పంపిణీ | The planned distribution of water | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా సాగునీటి పంపిణీ

Published Sat, Dec 28 2013 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

The planned distribution of water

కావలి, న్యూస్‌లైన్: కావలి కాలువ ఆయకట్టులోని పొలాలు ఎండకుండా ప్రణాళికాబద్ధంగా సాగునీరు అందించాలని సోమశిల ప్రాజెక్ట్ అధికారులను కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఆదేశించారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలను శుక్రవారం ‘భగీరథయత్నం’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఆయన స్పందించారు.
 
  కావలి కాలువ ఆయకట్టు ైరె తులకు సాగునీరందించే విషయమై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ వెంకటరమణారెడ్డితో కలిసి సోమశిల ప్రాజెక్ట్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ చివరి ఆయకట్టుకు ఎప్పుడు నీళ్లు ఇస్తారో చెబితే ఆ రోజు తాను వచ్చి పరిశీలిస్తానన్నారు. ఆయకట్టు పరిధిలో ఏ ఒక్క పొలం ఎండకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువ ద్వారా నీరు తలరించి చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఎప్పటిలోపు నింపుతారో చెప్పాలన్నారు. కావలి కాలువను పర్యవేక్షించే అధికారులు స్పందిస్తూ 1వ తేదీ వరకు చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీరు విడుదల చేస్తామన్నారు. అనంత రం ఎస్పీపాళెం మేజర్‌కు విడుదల చేస్తామని వివరించారు. ఆ సమయంలోనే చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. బ్రాహ్మణక్రాక, చామదల, హనుమకొండపాళెం, ఎస్వీపాళెం, గౌరవరం మేజర్లతో పాటు మైనర్‌కాలువలకు ఎంతనీటిని విడుదల చేస్తే పంటను కాపాడుకోవచ్చో చెప్పాలని అధికారులను ఆరా తీశారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం రావడంతో చివరి ఆ యకట్టు పంట పొలాలకు నీ రు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఆషామాషీగా నీటి వి డుదల చేయడం సరికాదన్నా రు. రైతులకు సాగునీరు అం దించే విషయంపై ఎప్పటికప్పుడు తాను సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటానన్నారు. పొలాలు ఎండుతున్నాయనే విషయం ఆయక ట్టు పరిధిలో ఎక్కడా కనిపించరాదన్నారు. కా వలి కాలువను పర్యవేక్షిస్తున్న టాస్క్‌ఫోర్స్ బృం దాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
 
 కలెక్టర్‌ను కలిసిన రైతులు
 పైర్లు ఎండుతున్నాయని దగదర్తి మండలం తా ళ్లూరు పంచాయతీ చైతన్యనగర్‌కు చెందిన రై తులు కలెక్టర్‌ను కలిశారు. తమకు కావలి కా లువ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. నీటి విడుదలపై అధికారులతో చర్చించామని, పంటలు ఎండకుండా కాపాడుతామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.సమావేశంలో సోమశిల ప్రాజెక్టు ఎస్‌ఈ సోమశేఖర్, ఈఈ నాయక్, డీఈలు రాఘవరావు, రాజేంద్రప్రసాద్, నీటిపారుదల శాఖ డీఈ శ్రీదేవి పాల్గొన్నారు.
 
 ఆందోళనవద్దు ప్రతి ఎకరా పండిస్తాం
 జలదంకి: సాగునీటి కోసం రైతులు ఆందోళన చెంద వద్దని కలెక్టర్ శ్రీకాంత్ రైతులకు భరోసా ఇచ్చారు. నాటిన ప్రతి ఎకరాను పండించేం దుకు సాగునీటిని అందిస్తామన్నారు. కావలి ఈఈ రాఘవరావు, కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డితో కలిసి చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. కావలి కాలువ నుంచి రిజర్వాయర్‌కు చేరుకుంటున్న నీటిని పరి శీలించి ఎన్ని క్యూసెక్కుల నీరు కాలువ ద్వారా రిజర్వాయర్‌కు చేరుతుందని, ఎప్పటి లోగా పూర్తిస్థాయిలో నిండుతుందని ఈఈని అడిగి తెలుసుకున్నారు. చినక్రాక, అన్నవరం గ్రా మాల రైతులు సాగునీరు అందక తమ పొలాలు ఎండిపోతున్నాయని కలెక్టర్‌కు చెప్పారు.
 
 జలదంకి పెద్దచెరువుకు చెందిన రైతులు కూడా తమ పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పెద్దచెరువు పరిధిలో రెండు వేల ఎకరాల్లో పంట ఎండుముఖం పట్టిందన్నారు. చినక్రాక రిజర్వాయర్ నుంచి ఏటి కాలువ ద్వారా సాగునీరు అందించాలని, లేకుంటే చెరువుకు నీరు అందించాలని కోరారు. కావలి కాలువ నుంచి రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటిని విడుదల చేస్తున్నామని, పొలాలకు సాగునీటిని విడుదల చేసేం దుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ కేవీ నారాయణ, తహశీల్దార్ మాల్యాద్రిరావు తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement