N.srikanth
-
జిల్లా సమగ్రాభివృద్ధిపై సీఎంకు నివేదిక
నెల్లూరు(టౌన్) : జిల్లా సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలె క్టర్ ఎన్.శ్రీకాంత్ నివేదిక అందజేశారు. రాష్ట్రం విడిపోయాక విజయవాడలో తొలిసారిగా 13 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వం చేపట్టబోయే ఏడు మిషన్లకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు. అనంతరం వీటిపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్లను ఆయన కోరారు. ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా పరిస్థితులను కలెక్టర్ శ్రీకాంత్ వివరించారు. ప్రధానంగా సాగునీటి వసతి కల్పన, కృష్ణపట్నంను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం ద్వారా జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రాథమిక రంగ మిషన్‌లో ఉత్పాదకత పెంచుకునేందుకు నెల్లూరు జిల్లాలో కాలువల మరమ్మతులు, చెరువుల్లో నీటి నిల్వ పెంపు, సూక్ష్మ సాగు, డ్రిప్‌ఇరిగేషన్ ద్వారా నీటిని పొదుపుగా వాడి అధిక దిగుబడులు సాధించడం వంటి అంశాలను వివరించారు. రెండో మిషన్‌లో భాగంగా జిల్లాలో ఉత ్పత్తి రంగాన్ని పెంచేందుకు చర్యలు సూచించారు. ఇందులో భాగంగా వలసల నివారణకు నైపుణ్యతతో కూడిన చేతి వృత్తులను నేర్పించి డిమాండ్ కల్పించడం లాంటి చర్యలు చేపట్టాలన్నారు. మూడో రంగంలో పరిశ్రమలు, ఇతర కర్మాగారాల ఏర్పాటు వల్ల నిరాశ్రయులైన వారికి మౌలిక వసతులతో కూడిన చక్కటి పునరావాసం కల్పించాలని సూచించారు. నాల్గో మిషన్‌కు సంబంధించి సేవా రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నారు. ఐటీ, ఫార్మా వంటి కంపెనీలు స్థాపించాలని కోరారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి కూడా ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చునని చెప్పారు. ఐదో అంశంగా పట్టణాభివృద్ధి కోసం మురికివాడల రహిత నగరంగా మార్చేందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయాలన్నారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరో అంశానికి సంబంధించి ైనె పుణ్య అభివృద్ధిపై చర్చించారు. ఏడో అంశంగా సామాజిక సాధికారతలో భాగంగా మెప్మాలాంటి సంస్థలను బలోపేతం చేయాలని, స్వయం ఉపాధి అవకాశాల మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పొందుపరిచారు. -
వైఎస్సార్సీపీకి విప్ అధికారం
నెల్లూరు(పొగతోట): ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, జెడ్పీ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్సీపీకి విప్ జారీచేసే అధికారం ఉందని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ స్పష్టం చేశారు. కలెక్టర్ మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ నెల 3న మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, 4న ఎంపీపీ, 5న జెడ్పీ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను టీడీపీ ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు కుట్రపన్నుతోంది. వైఎస్సార్సీపీకి విప్ జారీ చేసే అధికారం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 27న ఉత్వర్వులు ఇచ్చింది. వైఎస్సార్సీపీ గుర్తింపు పొందిన పార్టీగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక పార్టీ గుర్తుపై గెలుపొంది మరో పార్టీకి మద్దతు ఇవ్వడం నిబంధనలను అతిక్రమణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమించి మరో పార్టీకి మద్దతు తెలిపితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. మరో పార్టీకి ఓటు వేసినట్టు రుజువైతే ఆ ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు వేస్తారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. టీడీపీ నాయకులు నెల్లూరు నగర మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను అడ్డదారిలో దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్లో మీడియాలో వైఎస్సార్సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాదని కథనాలు రాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఏ పార్టీకైనా మద్దతు తెలపవచ్చని టీడీపీ నాయకులు ప్రకటిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా వైఎస్సార్సీపీకి గుర్తింపు వర్తించదని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటనలు చేయడం వారి కుళ్లు రాకీయాలకు అద్దంపడుతోంది. తమ పార్టీ తరపున గెలుపొందిన అభ్యర్థులు తమ వైపే ఉన్నారని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. టీడీపీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తమ అభ్యర్థులు వైఎస్సార్సీపీకే మద్దతు ప్రకటిస్తారని స్పష్టం చేశారు. -
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగిపైనా వేటు నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్ : నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కావలి డివిజన్లో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ ఎన్.ఉషారాణి ద్వారా విచారణ చేయించి ఫైల్ సిద్ధం చేయించి వారిపై వేటు వేశారు. కావలి మండలంలోని చిన్ననట్టు ప్రాథమిక పాఠశాలలో శానం కృష్ణ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఇతను ఇటీవల జరిగిన ఎన్నికల్లో, గతంలో ఎంపీ కోసం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ప్రచారం చేశాడని ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు విచారణ చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన భార్యను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి ఆమె తరపున ప్రచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అల్లూరు మండలంలోని బట్రకాగొల్లు ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న గంటా సుధాకర్ తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ముద్ర పడ్డాడు. వైఎస్సార్సీపీ కార్యకర్తగా ఉన్న కోవూరు రామయ్య హత్య కేసులో సుధాకర్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆ మేరకు కేసును ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఆయనపై కూడా వేటు వేశారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో ఒకరు సస్పెన్షన్ పలు ఆరోపణల నేపథ్యంలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో పనిచేస్తున్న ఏవీ రమణయ్య అనే ఉద్యోగిని కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోడ్ ఆఫ్ కాండక్ట్ అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం స్థానిక గోల్డన్జూబ్లీ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు. లోక్‌సభకు పోటి చేసే అభ్యర్థి రూ.70 లక్షలు, శాసనసభకు పోటి చేసే అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయకూడదన్నారు. అభ్యర్థులు సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు చేస్తున్న ఖర్చును డీడీ, చెక్ రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. నగదు, మద్యం, నగలు తదితర వాటితో ఓటర్లను ప్రలోభపేట్టె వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగదు, మద్యం పంపిణీ కాకుండా అంబులెన్స్‌లు, పోలీస్ వాహనాలు, ఆయిల్ ట్యాంకర్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తామన్నారు. గ్రామాల్లో శుభకార్యాలకు, పుట్టిన రోజు వేడుకల్లో భోజనాలు పెట్టి దానికి ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్థి హాజరైతే దానిని కూడా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం నీతివంతమైన ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. పత్రికల్లో వస్తున్న పెయిడ్ యాడ్స్, యాడ్స్‌ను నిర్ధారించేందు మీడియా సర్టిఫికేషన్ మానటరింగ్ కమిటీని(ఎంసీఎంసీ) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రైనీ జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని తెలిపారు. యాడ్ ఇవ్వాలనుకునే అభ్యర్థులు మూడు రోజుల ముందుగా ఎంసీఎంసీ వద్ద అనుమతి తీసుకోవాలన్నారు. రూ.50 వేలకు మించి నగదుతో ఎవరూ ప్రయాణం చేయకూడదన్నారు. అధిక మొత్తంలో నగదుతో ప్రయాణం చేస్తే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటామన్నా రు. నగదుకు పూర్తి స్థాయిలో ఆధారాలు చూపితే దానిని తిరిగి వారికి ఇస్తామన్నారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిష్పక్షపాతంగా వ్యవహరించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలి పారు. అనంతరం వివిధ పత్రికల బ్రాంచ్ మేనేజర్లు, ప్రింటింగ్ ప్రెస్‌ల యజామాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ జి.రేఖారాణి, ఏజేసీ రాజ్‌కుమార్, డీఆర్ఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ‘కార్యదర్శుల’కే పోస్టులు
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రస్తుతం కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న వారికే ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ శనివారం రాత్రి సంతకం చేశారు. వారికి సోమవారం నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో నిరుద్యోగులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వివిధ రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ జరుగుతున్న తీరే ఇందుకు నిదర్శనం. జిల్లాలో 140 పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో పాటు 11,400 మంది దరఖాస్తులు సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను మినహాయించి మిగిలిన వారి వద్ద రూ.50 వంతున దరఖాస్తు ఫీజు స్వీకరించారు. ఇలా సుమారు 8 వేల మంది నుంచి రూ.4 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు జమయింది. 15 మార్కుల వెయిటేజీ ఇచ్చినప్పటికీ తమకు ఉ ద్యోగాలు వచ్చేలా లేవంటూ కొందరు కాంట్రాక్టు కార్యదర్శులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తుది తీర్పు వచ్చేంత వరకు కాం ట్రాక్ట్ కార్యదర్శులనే రెగ్యులర్‌గా నియమించాలని ట్రిబ్యునల్ ఇటీవల ఆదేశించింది. ఈ క్రమంలో 129 పోస్టులను కాంట్రాక్ట్ కార్యదర్శులతోనే భర్తీ చేస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. నిరుద్యోగుల ఆగ్రహం కాంట్రాక్టు కార్యదర్శులకే పోస్టులు ఇవ్వాలనుకుంటే నోటిఫికేషన్ లేకుండా వారినే రెగ్యులర్ చేయవచ్చు కదా..అని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడంతో జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు ఫీజు రూ.50 పోగా వివిధ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశామని, చివరకు కాళ్లతిప్పట తప్ప ఫలితం కరువైందని వాపోతున్నారు. తమకు లేనిపోని ఆశలు రేకెత్తించడం దేనికని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన 11 పోస్టుల గతేంటి? నోటిఫికేషన్లో 140 పోస్టులను ప్రకటించ గా ప్రస్తుతం 129 మాత్రమే భర్తీ అవుతున్నాయి. మిగిలిన 11 పోస్టులపై అధికారుల నుంచి స్పష్టత కరువైంది. ఈ విషయాన్ని జెడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో జితేంద్ర వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ట్రిబ్యునల్ తుది తీర్పును అనుసరించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
గ్రామసభలకు నిధులెలా ?
నెల్లూరు(టౌన్ ), న్యూస్‌లైన్: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ వినూత్నంగా నిర్వహిస్తున్న గ్రామసభలకు స్పందన లభిస్తోంది. చిల్లకూరు మండలం పాలిచెర్లవారిపాళెంలో నిర్వహించిన తొలిసభ విజయవంతమైంది. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయం తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ గ్రామసభ నిర్వహణ ఖర్చు సుమారు రూ.7 వేలు అయింది. ఏడాదిలో మొత్తం నాలుగు సభలు నిర్వహించాలంటే ఖర్చు రూ.28 వేలు అవుతుంది. ఈ మొత్తాన్ని జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో చిన్న పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ పనులు చేపట్టేందుకే నిధులు లేకపోవడంతో ఈ గ్రామసభలకు ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో మొత్తం 940 పంచాయితీలు ఉన్నాయి. వీటిలో 500 ఓటర్లలోపు ఉన్న పంచాయతీలు 89, 501 నుంచి వెయ్యి ఓటర్లలోపు ఉన్న పంచాయతీలు 311 , 1,001 నుంచి 1500 ఓటర్లలోపు ఉన్న పంచాయతీలు 259 ఉన్నాయి. మొత్తం మీద చిన్న పంచాయతీలే ఎక్కువ. వీటికి ఏడాదికి వచ్చే ఆదాయం రూ.15 వేలు నుంచి రూ.20 వేలు లోపే ఉంటుంది. ఈ క్రమంలో గ్రామసభల నిర్వహణకు రూ.28 వేలు ఎక్కడి నుంచి తేవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. వెంకటాచలం మండలంలోని ఆత్రంవారి కండ్రికలో 100 ఓట్లే ఉన్నాయి. సైదాపురం మండలంలోని గోకుల బృందావనంలోనూ ఇదే పరిస్థితి. వరికుంటపాడు మండలంలోని జ్ఞానేశ్వరపురంలో 300 ఓట్లు వరకు ఉన్నారు. ఇలా వెయ్యి లోపు ఓటర్లున్న పంచాయతీలకు ప్రభుత్వం దామాషా ప్రకారం సాధారణ నిధుల కింద ఏడాదికి రూ.4 వేలు ఇస్తుంది. వివిధ రకాల పన్నుల రూపంలో మరో రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వరకు వచ్చే అవకాశముంది. పెద్ద పంచాయతీల్లో ఓకే : సీనరేజీ, లేఅవుట్లు, భవననిర్మాణ ఫీజులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, వేలం పాటల ద్వారా పెద్దపంచాయతీలకు ఆదాయం లక్షల్లో ఉంటుంది. ఇలాంటి పంచాయతీలకు గ్రామసభల నిర్వహణ పెద్దసమస్య కాబోదు. చిన్న పంచాయతీలే నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికారులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రామసభల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తాం గ్రామసభలకు అయ్యే ఖర్చును తగ్గించేందుకు చూస్తున్నాం. కుర్చీలకు బదులు పట్టలు వేయించే ఆలోచన చేస్తున్నాం. ఫొటోలు, వీడియో తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. ఈ ఖర్చును ప్రభుత్వమే భరించే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. ఎం.జితేంద్ర, జెడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీఓ -
ప్రణాళికాబద్ధంగా సాగునీటి పంపిణీ
కావలి, న్యూస్‌లైన్: కావలి కాలువ ఆయకట్టులోని పొలాలు ఎండకుండా ప్రణాళికాబద్ధంగా సాగునీరు అందించాలని సోమశిల ప్రాజెక్ట్ అధికారులను కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఆదేశించారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలను శుక్రవారం ‘భగీరథయత్నం’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఆయన స్పందించారు. కావలి కాలువ ఆయకట్టు ైరె తులకు సాగునీరందించే విషయమై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ వెంకటరమణారెడ్డితో కలిసి సోమశిల ప్రాజెక్ట్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ చివరి ఆయకట్టుకు ఎప్పుడు నీళ్లు ఇస్తారో చెబితే ఆ రోజు తాను వచ్చి పరిశీలిస్తానన్నారు. ఆయకట్టు పరిధిలో ఏ ఒక్క పొలం ఎండకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువ ద్వారా నీరు తలరించి చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఎప్పటిలోపు నింపుతారో చెప్పాలన్నారు. కావలి కాలువను పర్యవేక్షించే అధికారులు స్పందిస్తూ 1వ తేదీ వరకు చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీరు విడుదల చేస్తామన్నారు. అనంత రం ఎస్పీపాళెం మేజర్‌కు విడుదల చేస్తామని వివరించారు. ఆ సమయంలోనే చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. బ్రాహ్మణక్రాక, చామదల, హనుమకొండపాళెం, ఎస్వీపాళెం, గౌరవరం మేజర్లతో పాటు మైనర్కాలువలకు ఎంతనీటిని విడుదల చేస్తే పంటను కాపాడుకోవచ్చో చెప్పాలని అధికారులను ఆరా తీశారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం రావడంతో చివరి ఆ యకట్టు పంట పొలాలకు నీ రు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఆషామాషీగా నీటి వి డుదల చేయడం సరికాదన్నా రు. రైతులకు సాగునీరు అం దించే విషయంపై ఎప్పటికప్పుడు తాను సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటానన్నారు. పొలాలు ఎండుతున్నాయనే విషయం ఆయక ట్టు పరిధిలో ఎక్కడా కనిపించరాదన్నారు. కా వలి కాలువను పర్యవేక్షిస్తున్న టాస్క్‌ఫోర్స్ బృం దాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన రైతులు పైర్లు ఎండుతున్నాయని దగదర్తి మండలం తా ళ్లూరు పంచాయతీ చైతన్యనగర్‌కు చెందిన రై తులు కలెక్టర్‌ను కలిశారు. తమకు కావలి కా లువ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. నీటి విడుదలపై అధికారులతో చర్చించామని, పంటలు ఎండకుండా కాపాడుతామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.సమావేశంలో సోమశిల ప్రాజెక్టు ఎస్ఈ సోమశేఖర్, ఈఈ నాయక్, డీఈలు రాఘవరావు, రాజేంద్రప్రసాద్, నీటిపారుదల శాఖ డీఈ శ్రీదేవి పాల్గొన్నారు. ఆందోళనవద్దు ప్రతి ఎకరా పండిస్తాం జలదంకి: సాగునీటి కోసం రైతులు ఆందోళన చెంద వద్దని కలెక్టర్ శ్రీకాంత్ రైతులకు భరోసా ఇచ్చారు. నాటిన ప్రతి ఎకరాను పండించేం దుకు సాగునీటిని అందిస్తామన్నారు. కావలి ఈఈ రాఘవరావు, కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డితో కలిసి చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. కావలి కాలువ నుంచి రిజర్వాయర్‌కు చేరుకుంటున్న నీటిని పరి శీలించి ఎన్ని క్యూసెక్కుల నీరు కాలువ ద్వారా రిజర్వాయర్‌కు చేరుతుందని, ఎప్పటి లోగా పూర్తిస్థాయిలో నిండుతుందని ఈఈని అడిగి తెలుసుకున్నారు. చినక్రాక, అన్నవరం గ్రా మాల రైతులు సాగునీరు అందక తమ పొలాలు ఎండిపోతున్నాయని కలెక్టర్‌కు చెప్పారు. జలదంకి పెద్దచెరువుకు చెందిన రైతులు కూడా తమ పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పెద్దచెరువు పరిధిలో రెండు వేల ఎకరాల్లో పంట ఎండుముఖం పట్టిందన్నారు. చినక్రాక రిజర్వాయర్ నుంచి ఏటి కాలువ ద్వారా సాగునీరు అందించాలని, లేకుంటే చెరువుకు నీరు అందించాలని కోరారు. కావలి కాలువ నుంచి రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటిని విడుదల చేస్తున్నామని, పొలాలకు సాగునీటిని విడుదల చేసేం దుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ కేవీ నారాయణ, తహశీల్దార్ మాల్యాద్రిరావు తదితరులు ఉన్నారు. -
ఎకరం కూడా ఎండనివ్వం
బిట్రగుంట, న్యూస్‌లైన్: కావలి కాలువ కింద సాగులో ఉన్న ఆయకట్టులో ఎకరం పంటను కూడా ఎండనివ్వకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. సాగునీరు అం దక కావలి నియోజకవర్గం లో ఎండుతున్న పంటలపై ‘సమరసాక్షి’ కథనాలకు స్పందించిన కలెక్టర్ కొండబిట్రగుంట, పాతబిట్రగుంట గ్రామాల్లో ఎండిపోతున్న వరి పైరును గురువారం పరిశీలించారు. ఆయకట్టు పరిస్థితిపై రైతులను ఆరా తీశారు. నీరందక చివరి ఆయకట్టులో లేతపొట్టదశలో ఉన్న పంట మొత్తం ఎండిపోతోందని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. రెండు తడులకు నీరు అందిస్తే పైరుకు ప్రాణం పోసినట్టేనని వివరించారు. వెంటనే కలెక్టర్ తన వెంట ఉన్న సోమశిల, ఇరిగేషన్ అధికారులతో సాగునీటి సరఫరాపై చర్చించారు. కావలి కాలువకు ఎన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు? కాలువ నుంచి శ్రీవెంకటేశ్వరపాళెం నకు ఎంత నీటిని వదులుతున్నారు ? ఆయకట్టు చివరి ప్రాంతానికి ఎంత నీరు అందుతోందని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారులు రికార్డుల ప్రకారం లెక్కలు చెబుతుండగా రైతులు అభ్యంతరం తెలిపారు. అవన్నీ అబద్ధాలేనని, శివారు ఆయకట్టు వద్ద కాలువ కూడా తడవడం లేదని కలెక్టర్‌తో చెప్పారు. ఎగువ ప్రాంతాల్లోని అనధికారిక ఆయకట్టులో రైతులు మోటార్లతో నీటిని తోడేస్తుండటంతో చివరి ఆయకట్టుకు చుక్కనీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ కూడా పూడికతో నిండిఉండటంతో క్యూసెక్కుల లెక్కలు కచ్చితంగా లేవన్నారు. స్పందించిన కలెక్టర్ మరోమారు సోమశిల, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. సంగం బ్యారేజీ వద్ద ఇసుక బస్తాలు వేసి కావలి కాలువకు 550 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సూచించారు. అక్రమ మోటార్లు వినియోగాన్ని తగ్గించేందుకు, వారబందీ ప్రకారం సాగునీటిని వినియోగించుకునేందుకు ప్రత్యేక బృందాలతో కాలువపై గస్తీ నిర్వహించాలన్నారు. కాలువల వద్ద నీటి మట్టాలను పరిశీలించి పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులకు ముచ్చెమటలు సాగునీటి విడుదలపై కలెక్టర్ శ్రీకాంత్ ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. సోమశిల, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో కాలువకు ఎన్ని క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు, ఆయకట్టు చివరి ప్రాంతానికి ఎంత నీరు వెళుతుందనే విషయంపై వారికి స్పష్టత కరువై సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్, సోమశిల ఎస్ఈలు సోమశేఖర్, కోటేశ్వరరావు, డీఈలు, తహశీల్దార్ లావణ్య, ఎంపీడీవో కనకదుర్గా భవాని, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. -
‘రక్త’ ప్రక్షాళన
సాక్షి, నెల్లూరు: రక్తనిధిల నిర్వహణలో పారదర్శకత తెచ్చేందుకు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ శ్రీకారం చుట్టారు. నెల్లూరులోని డీఎస్సార్ ఆస్పత్రి రక్తనిధి నుంచి పెద్ద ఎత్తున రక్తాన్ని అక్రమంగా తరలిస్తూ ఏడాది క్రితం కొందరు దొరికిపోయారు. జిల్లాలోని పలు రక్తనిధిల నుంచి సైతం అక్రమంగా రక్తాన్ని తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు అప్పట్లో జిల్లా అధికారులు ప్రకటించారు. ఏడాది కావస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో కలెక్టర్ శ్రీకాంత్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అన్ని రక్తనిధిలను ఆన్లైన్ ద్వారా ఒకే గొడుగు కిందకు తె చ్చేలా కార్యాచరణ రూపొందించారు. ఆరోగ్య విభాగం పర్యవేక్షణలో జరిగే ఈ ప్రక్రియ నేడో,రేపో అమలులోకి రానుంది. కలెక్టర్ శ్రీకాంత్ ఆరోగ్యశ్రీ పథకం సీఈఓగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని అన్ని రక్తనిధిలను ఆన్లైన్ ద్వారా ఏకం చేయాలని సంకల్పించారు. అందుకోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. దానిని ప్రారంభించే సమయానికి శ్రీకాంత్ నెల్లూరు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక్కడికి వచ్చిన ఆయన ప్రభుత్వ రక్తనిధిలో జరిగిన అక్రమాలను తెలుసుకున్నారు. వెంటనే రక్తనిధిల కేంద్రీకరణకు చర్యలు చేపట్టారు. నూతన విధానాన్ని నెల్లూరు నుంచే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథక విభాగం పర్యవేక్షణలో నిర్వహించే ఈ ప్రక్రియను 104 విభాగం అమలుచేస్తుంది. రక్తనిధిలను అక్రమాలకు తావులేకుండా నిర్వహించడమే దీని ఉద్దేశం. రక్తదాతల వివరాలతో పాటు వారి రక్తగ్రూపు వివరాలను సైతం ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అన్ని పరీక్షల అనంతరం దాతలు ఇచ్చే రక్తం, గ్రూపుల వివరాలు, గడువు కాలం ఆ ప్యాకెట్‌పై ముద్రిస్తారు. స్టాక్ వివరాలను సైతం ఆన్లైన్లో పొందు పరుస్తారు. రక్తం అవసరమైన వారు 104ను సంప్రదిస్తే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని నిల్వల సమాచారమైనా తెలుస్తుంది. తగ్గిపోయిన దాతలు : నెల్లూరులో ప్రభుత్వ రక్తనిధి కేంద్రంతో మరో మూడు ప్రధాన రక్తనిధి కేంద్రాలున్నాయి. కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, ఉదయగిరి, గూడూరు, దుగ్గరాజపట్నంలో ఆరు ఉపకేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 40 వేల మంది వరకు రక్తదాతలున్నారు. ఏడాది క్రితం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రి రక్తనిధి నుంచి అక్రమంగా రక్తం తరలిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో దాతలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా రక్తనిల్వలు తగ్గిపోయి, అత్యవసర సమయంలో రోగులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు రక్తదాతలను ప్రోత్సహించడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. నిబంధనల ప్రకారం రక్తదాతల వివరాలను ఆయా రక్తనిధిల్లో తప్పనిసరిగా నమోదుచేయాలి. వారు రక్తం ఎప్పుడు ఇచ్చారు, దానిని ఎలా వినియోగించారో రికార్డుల్లో పేర్కొనాలి. ఒక వేళ ఆ రక్తం పనికిరాకపోయినా సంబంధిత వివరాలను పొందుపరచాలి. ప్రతి రక్తదాత మూడునెలలకోసారి రక్తం ఇవ్వవచ్చు. ఆ సమయం పూర్తయినప్పుడు దాతకు తెలియజేస్తే మళ్లీ వచ్చి రక్తం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కసరత్తు రక్తనిధిల్లో జరుగుతున్న దాఖలాలు లేవు. దాత సిఫార్సు చేస్తే రాయితీ: రక్తం ఇచ్చిన దాత సిఫార్సు చేస్తే 50 శాతం రాయితీతో అందించాల్సి ఉన్నా అది జరగడం లేదు. కొందరు దాతల పేర్లను అధికారులే నమోదు చేసి ఆ రాయితీని జేబులో వేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కలెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలతో అక్రమాలకు కళ్లెం పడుతుందని రక్తదాతలు ఆశిస్తున్నారు. -
వైకల్య రహిత సమాజమే లక్ష్యం
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్ : వచ్చే ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో రూ.4,922 కోట్లతో ముందస్తు వార్షిక రుణప్రణాళిక (ప్రొటెన్షియల్ లింక్డ్ ప్లాన్)ను రూపొందించినట్లు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. స్థానిక గోల్డెన్ జూబ్లీ హాలులో మంగళవారం బ్యాంకర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నాబార్డ్ ద్వారా వార్షిక ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. వీటిలో పంట రు ణాలకు రూ.3,006 కోట్లు, కాలవ్యవధి వ్యవసా య రుణాలకు రూ.468 కోట్లు, పారిశ్రామిక రంగానికి రూ.615 కోట్లు, ఇతర ప్రాధాన్య రం గాలకు రూ.834 కోట్లు కేటాయించామని వెల్లడించారు. జిల్లాలోని 342 బ్యాంకుల్లో ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ఆయన బ్యాంకర్లను ఆదేశించారు. కౌలురైతులకు పంట రుణాలు మంజూరు చేసేందుకు ప్రతి గురువారాన్ని కేటాయించాలన్నారు. డెయిరీ అభివృద్ధి పథకం కిం ద నాబార్డు ద్వారా ఓసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. జిల్లాలోని 342 బ్యాంకుల ద్వారా రూ.11,967 కోట్ల రుణాలు లబ్ధిదారులకు మంజూరయ్యాయన్నారు. బ్యాంకులకు నిర్ధేశించిన లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను 10వ తేదీ నాటికి తమకు అందజేయాలన్నారు. రికవరీలపై ప్రత్యేకదృష్టి రుణ రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఖరీఫ్ పంటకు రూ.896 కోట్ల రుణం మంజూరు చేయాలని లక్ష్యం కాగా రూ. 946 కోట్లు మంజూరు చేశారన్నారు. కౌలు రైతులకు రూ.100 కోట్లు రుణపంపిణీ లక్ష్యం కాగా రూ.7 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. పొదుపు సంఘాలకు రూ.384 కోట్లు లక్ష్యం కాగా రూ. 213 కోట్లు, పట్టణ ఇందిర క్రాంతి పథకం కింద రూ.85 కోట్లు లక్ష్యం కాగారూ 41 కోట్లు మంజూరు చేశామని కలెక్టర్ వివరించారు. రానున్న నాలుగు నెలల్లో లక్ష్యాలను అధిగమించాలని ఆయన బ్యాంకర్లు, అధికారులకు సూచించారు. నెల్లూరు రూరల్ మండలంలోని ములుమూడిలో ఎస్బీఐ, ఏఎస్‌పేట మం డలం హసనాపురంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీన్ని పరిశీలించి ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, ఎల్డీఎం పి. వెంకటేశ్వరరావు, సిండికేట్ బ్యాంక్ డీజీఎం కె. శ్రీనివాసరావు, రిజర్వు బ్యాంక్ ఏజీఎం సమీర్ సర్కార్, నాబార్డు ఏజీఎం వివేకానందరెడ్డి, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం సురేంద్ర, ఎస్బీఐ డీజీఎం శేషగిరిరావు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజన ల్ మేనేజర్ మస్తానయ్య పాల్గొన్నారు. -
హడలెత్తిస్తున్న హెలెన్
సాక్షి, నెల్లూరు: హెలెన్ తుపాన్ రూపంలో జిల్లాకు ముప్పు ముంచుకొస్తోంది. తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పై-లీన్ తుపాన్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తుపాన్ శ్రీహరికోట-ఒంగోలు మధ్యలో కావలి వద్ద తీరం దాట నుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణపట్నం పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ బుధవారం అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరినీ అప్రమత్తం చేశారు. ఇరిగేషన్, హెల్త్, వ్యవసాయశాఖ, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ఇప్పటికే గుంటూరు జిల్లా రెస్క్యూ టీంలు జిల్లాకు చేరుకున్నాయి. అవసరమైతే మరిన్ని బృందాలను రప్పించేందుకు చర్యలు చేపట్టారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తుపాన్ పరిస్థితిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ శ్రీకాంత్‌తో మాట్లాడారు. నెల్లూరులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూం(0861-23311477,1331261) ఏర్పాటయింది. జిల్లా వ్యాప్తంగా 46 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. కావలి, బోగోలు, అల్లూరు, చిల్లకూరు, అల్లూరు, కోట, వాకాడు, చిట్టమూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం తదితర మండలాల్లోని తీరగ్రామాల నుంచి 25 వేల మందిని ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. భారీవర్షాలు కురిస్తే చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులను అలెర్ట్ చేశారు. కావలి డివిజన్ పరిధిలో బలహీనంగా ఉన్న చెరువు కట్టల వద్ద ఇసుకబస్తాలు సిద్ధం చేయాలని అధికారులను ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు ఆదేశించారు. మరోవైపు తీరప్రాంతంలో మత్స్యకారులు అప్రమత్తయ్యారు. పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. టెన్షన్..టెన్షన్ తుపాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో పూరిళ్లు, రేకులిళ్లలో నివాసం ఉంటున్న వారితో పాటు అరటి, కొబ్బరితోటలు సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఇందుకూరుపేట, కోవూరు, సంగం, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లో వందలాది ఎకరాల్లో అరటిపంట సాగవుతోంది. గాలి తీవ్రతకు అరటిచెట్లు నేలమట్టమయ్యే ప్రమాదమున్నందున ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా రొయ్యల రైతులకు కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. వెనామీ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తీరప్రాంతంలోని వేలాది ఎకరాల్లో రొయ్యలగుంటలు సాగుచేస్తున్నారు. కుండపోత వర్షం కురిస్తే గుంటలు తెగిపోయే ప్రమాదముంది. నీటిలో ఉప్పుశాతం తగ్గిపోయి సమస్యలు ఏర్పడుతాయని పలువురు రైతులు టెన్షన్ పడుతున్నారు. ఇటీవలే నారేతలు వేసుకున్న రైతులను ముంపు భయం వెంటాడుతోంది. -
చెరువు తూములో రైతు గల్లంతు
మనుబోలు(వెంకటాచలం)న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తూ చెరువు తూములో పడి ఓ రైతు గల్లంతయిన సంఘటన వెంకటాచలం మండలం కనుపూరులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కనుపూరుకు చెందిన రైతు కుడితిపూడి (25) రాజేంద్ర పొలానికి నీళ్లు కట్టేందుకు చెరువు తూము వద్దకు వెళ్లాడు. తూముకు అడ్డుగా ఉన్న ఇసుక బస్తాలను తొలగిస్తుండగా వరద ఉధృతికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయి తూములో ఇరుక్కుపోయాడు. నీటి ఉధృతికి రైతు కనిపించకుండా పోవడంతో ఈ విషయాన్ని గ్రామస్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. స్పందించిన కాకాణి కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌కు ఫోన్ చేసి రాజేంద్ర ఆచూకీ కనుగొనేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి ఉధృతిని తగ్గించేందుకు తూము చెక్కలను పైకి లేపేందుకు ప్రొక్లైనర్‌ను వాడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాజేంద్ర ఆచూకీ కోసం ఎస్సై సోమయ్య ఆధ్వర్యంలో రెస్క్యూ టీం గాలింపు జరుపుతుంది.