నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్ : వచ్చే ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో రూ.4,922 కోట్లతో ముందస్తు వార్షిక రుణప్రణాళిక (ప్రొటెన్షియల్ లింక్‌డ్ ప్లాన్)ను రూపొందించినట్లు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. స్థానిక గోల్డెన్ జూబ్లీ హాలులో మంగళవారం బ్యాంకర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నాబార్డ్ ద్వారా వార్షిక ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. వీటిలో పంట రు ణాలకు రూ.3,006 కోట్లు, కాలవ్యవధి వ్యవసా య రుణాలకు రూ.468 కోట్లు, పారిశ్రామిక రంగానికి రూ.615 కోట్లు, ఇతర ప్రాధాన్య రం గాలకు రూ.834 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
జిల్లాలోని 342 బ్యాంకుల్లో ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ఆయన బ్యాంకర్లను ఆదేశించారు. కౌలురైతులకు పంట రుణాలు మంజూరు చేసేందుకు ప్రతి గురువారాన్ని కేటాయించాలన్నారు. డెయిరీ అభివృద్ధి పథకం కిం ద నాబార్డు ద్వారా ఓసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 33.3 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. జిల్లాలోని 342 బ్యాంకుల ద్వారా రూ.11,967 కోట్ల రుణాలు లబ్ధిదారులకు మంజూరయ్యాయన్నారు. బ్యాంకులకు నిర్ధేశించిన లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను 10వ తేదీ నాటికి తమకు అందజేయాలన్నారు.
రికవరీలపై ప్రత్యేకదృష్టి
రుణ రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఖరీఫ్ పంటకు రూ.896 కోట్ల రుణం మంజూరు చేయాలని లక్ష్యం కాగా రూ. 946 కోట్లు మంజూరు చేశారన్నారు. కౌలు రైతులకు రూ.100 కోట్లు రుణపంపిణీ లక్ష్యం కాగా రూ.7 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. పొదుపు సంఘాలకు రూ.384 కోట్లు లక్ష్యం కాగా రూ. 213 కోట్లు, పట్టణ ఇందిర క్రాంతి పథకం కింద రూ.85 కోట్లు లక్ష్యం కాగారూ 41 కోట్లు మంజూరు చేశామని కలెక్టర్ వివరించారు. రానున్న నాలుగు నెలల్లో లక్ష్యాలను అధిగమించాలని ఆయన బ్యాంకర్లు, అధికారులకు సూచించారు.
నెల్లూరు రూరల్ మండలంలోని ములుమూడిలో ఎస్‌బీఐ, ఏఎస్‌పేట మం డలం హసనాపురంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీన్ని పరిశీలించి ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, ఎల్‌డీఎం పి. వెంకటేశ్వరరావు, సిండికేట్ బ్యాంక్ డీజీఎం కె. శ్రీనివాసరావు, రిజర్వు బ్యాంక్ ఏజీఎం సమీర్ సర్కార్, నాబార్డు ఏజీఎం వివేకానందరెడ్డి, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం సురేంద్ర, ఎస్‌బీఐ డీజీఎం శేషగిరిరావు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజన ల్ మేనేజర్ మస్తానయ్య పాల్గొన్నారు.
వైకల్య రహిత సమాజమే లక్ష్యం
Published Wed, Dec 4 2013 3:56 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement