నెల్లూరు(పొగతోట): ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, జెడ్పీ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీకి విప్ జారీచేసే అధికారం ఉందని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ స్పష్టం చేశారు. కలెక్టర్ మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
ఈ నెల 3న మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, 4న ఎంపీపీ, 5న జెడ్పీ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు కుట్రపన్నుతోంది. వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే అధికారం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 27న ఉత్వర్వులు ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ గుర్తింపు పొందిన పార్టీగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఒక పార్టీ గుర్తుపై గెలుపొంది మరో పార్టీకి మద్దతు ఇవ్వడం నిబంధనలను అతిక్రమణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమించి మరో పార్టీకి మద్దతు తెలిపితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. మరో పార్టీకి ఓటు వేసినట్టు రుజువైతే ఆ ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు వేస్తారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందారు.
టీడీపీ నాయకులు నెల్లూరు నగర మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను అడ్డదారిలో దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్లో మీడియాలో వైఎస్సార్‌సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాదని కథనాలు రాయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ఏ పార్టీకైనా మద్దతు తెలపవచ్చని టీడీపీ నాయకులు ప్రకటిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా వైఎస్సార్‌సీపీకి గుర్తింపు వర్తించదని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటనలు చేయడం వారి కుళ్లు రాకీయాలకు అద్దంపడుతోంది. తమ పార్టీ తరపున గెలుపొందిన అభ్యర్థులు తమ వైపే ఉన్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. టీడీపీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తమ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీకే మద్దతు ప్రకటిస్తారని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీకి విప్ అధికారం
Published Wed, Jul 2 2014 2:39 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement