నెల్లూరు(టౌన్) : జిల్లా సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలె క్టర్ ఎన్.శ్రీకాంత్ నివేదిక అందజేశారు. రాష్ట్రం విడిపోయాక విజయవాడలో తొలిసారిగా 13 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వం చేపట్టబోయే ఏడు మిషన్లకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు.
అనంతరం వీటిపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కలెక్టర్లను ఆయన కోరారు. ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా పరిస్థితులను కలెక్టర్ శ్రీకాంత్ వివరించారు. ప్రధానంగా సాగునీటి వసతి కల్పన, కృష్ణపట్నంను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం ద్వారా జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రాథమిక రంగ మిషన్‌లో ఉత్పాదకత పెంచుకునేందుకు నెల్లూరు జిల్లాలో కాలువల మరమ్మతులు, చెరువుల్లో నీటి నిల్వ పెంపు, సూక్ష్మ సాగు, డ్రిప్‌ఇరిగేషన్ ద్వారా నీటిని పొదుపుగా వాడి అధిక దిగుబడులు సాధించడం వంటి అంశాలను వివరించారు. రెండో మిషన్‌లో భాగంగా జిల్లాలో ఉత ్పత్తి రంగాన్ని పెంచేందుకు చర్యలు సూచించారు. ఇందులో భాగంగా వలసల నివారణకు నైపుణ్యతతో కూడిన చేతి వృత్తులను నేర్పించి డిమాండ్ కల్పించడం లాంటి చర్యలు చేపట్టాలన్నారు. మూడో రంగంలో పరిశ్రమలు, ఇతర కర్మాగారాల ఏర్పాటు వల్ల నిరాశ్రయులైన వారికి మౌలిక వసతులతో కూడిన చక్కటి పునరావాసం కల్పించాలని సూచించారు. నాల్గో మిషన్‌కు సంబంధించి సేవా రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నారు. ఐటీ, ఫార్మా వంటి కంపెనీలు స్థాపించాలని కోరారు.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి కూడా ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చునని చెప్పారు. ఐదో అంశంగా పట్టణాభివృద్ధి కోసం మురికివాడల రహిత నగరంగా మార్చేందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయాలన్నారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరో అంశానికి సంబంధించి ైనె పుణ్య అభివృద్ధిపై చర్చించారు. ఏడో అంశంగా సామాజిక సాధికారతలో భాగంగా మెప్మాలాంటి సంస్థలను బలోపేతం చేయాలని, స్వయం ఉపాధి అవకాశాల మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పొందుపరిచారు.
జిల్లా సమగ్రాభివృద్ధిపై సీఎంకు నివేదిక
Published Fri, Aug 8 2014 3:40 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement