చేవెళ్ల పరిసర ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
చేవెళ్ల పరిసర ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో రోహిణీ కార్తెలో విత్తనాలు వేసిన రైతులకు ఎంతో ఉపశమనం కలిగింది. వారం రోజులనుంచి అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేందుకు రైతులు ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాల వద్ద సందడి చేస్తున్నారు.