
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం
నిజామాబాద్: జిల్లాలో బుధవారం ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. యడపల్లి మండలం జంకంపేట గ్రామంలో భారీ వర్షం కురవడంతో పంటపొలాలు చెరువును తలపిస్తున్నాయి. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.