ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం
రోడ్లపై విరిగిపడిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
లేచిపోయిన ఇళ్ల పైకప్పులు, నిలిచిన కరెంట్ సరఫరా
కైలాస్‌నగర్/నిజామాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటల వరకు ఎండ దంచికొట్టగా.. అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వాంకిడి సమీపంలో గల జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాంసిలో ఓ ఇంటి ఆవరణలో గల కొబ్బరిచెట్లు విరిగి పడ టంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు తెచి్చన జొన్నలు తడిసిపోయాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందు లు పడ్డారు.
తలమడుగు మండలం ఉండం గ్రామ సమీపంలోని 33 కేవీ వి ద్యుత్ స్తంభం విరిగిపడటంతో తాంసి, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తలమడుగు మండలంలోని పూనగూడ, పల్సి–బి, పల్సి–కే గ్రామాలలో ఈదురుగాలుల దెబ్బ కు పలు ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. బోథ్ మండలం మర్లవాయిలో ఇంటి పైకప్పుపై ఉన్న రేకులు ఎగిరిపోయి విద్యుత్‌వైర్లపై పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment