
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో వర్షం పడటంతో ధాన్యాన్ని కుప్పలుగా చేస్తున్న రైతులు
సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్)/సాక్షి, కామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ నగరం గూపన్‌పల్లిలో అత్యధికంగా 57.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో వర్షం కారణంగా ధాన్యం తడిసింది.
అలాగే కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, నస్రుల్లాబాద్, బాన్సువాడ, రాజంపేట, బీర్కూర్, కామారెడ్డి, మాచారెడ్డి తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. రైతులు వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పే ప్రయత్నం చేసినా చాలాచోట్ల వడ్లు తడిసి పోయాయి. కొన్ని చోట్ల భారీ వర్షం వల్ల వడ్లు కొట్టుకుపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment