భారీ వర్షం...రైతుల హర్షం
ఆరుతడి, వరి పంటలకు మేలంటున్న అన్నదాతలు
నిజాంసాగర్: ‘ఎన్నాళ్లకు గుర్తొచ్చానే వాన... ఎన్నాళ్లని దాక్కుంటావే పైన’ అనే సినీ గేయూ న్ని తలిపించేలా రెండు నెలల తర్వాత భారీ వర్షం కురిసింది. వర్షాల కోసం వరుణయాగాలు, అభిషేకాలు, కప్పకావడి, అన్నదానాలు.. ఇలా ఎన్నిచేసినా వరుణుడు కరుణించకపోవడంతో కరువుచాయలు ఏర్పడ్డారుు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురవడంతో మడికట్లల్లో నీళ్లు నిలిచాయి.
ఆరుతడి, వరి పంటలకు మేలు
ఖరీఫ్ సీజన్ ఆరంభం సమయంలో కురిసిన చిరు జల్లులకు సాగు చేసిన ఆరుతడి, వరి పంటలకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేల హెక్టార్లల్లో సాగు చేసిన సోయాచిక్కుడు, పత్తి, మొక్క జొన్న, పెసర, మినుము పంటలకు జీవం పోసిందంటున్నారు. బోరుబావులు, చెరువులు, కుంటల కింద సాగు చేస్తున్న వరి పొలాలకు సైతం కొంత ఉపశమనం కలుగుతుందని చెపుతున్నారు.
నిజామాబాద్‌లో..
నిజామాబాద్ నగరంలోనూ మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యూయి. ప్రయూణికులు వర్షానికి తడిసి ముద్దయ్యూరు. అరుునా.. చాలా రోజుల తర్వాత వర్షం కురియడంతో వాతావరణం చల్లబడిందని, పంటలకు మేలు కలుగుతుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.