ఆ వార్తల్లో నిజం లేదు : ఉపాసన | Upasana Condensed About Her Political Entry | Sakshi
Sakshi News home page

Jan 28 2019 4:08 PM | Updated on Jan 28 2019 4:08 PM

Upasana Condensed About Her Political Entry - Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రామ్‌ చరణ్‌ అప్‌డేట్స్‌నే కాకుండా తన వృత్తికి, అపోలో హాస్పిటల్స్‌ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ పత్రికలో వచ్చిన వార్తను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు.

చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిపై తాను టీఆర్‌ఎస్‌ తరుపున పోటీచేస్తున్నట్లుగా వచ్చిన వార్తను ఉపాసన ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని.. తాను ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను ప్రేమిస్తున్నానని సంగీతా రెడ్డి(కొండ విశ్వేశ్వర రెడ్డి భార్య) తన బాస్‌ అంటూ చెప్పుకొచ్చారు. చిన్నాన్న(విశ్వేశ్వర రెడ్డి) చేవెళ్లలో మంచి పనులు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇటీవలె దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో ఉపాసన పాల్గొన్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement