konda visweswara reddy
-
'చిన్నారి కిట్టయ్య' సాంగ్ బాగుంది.. ‘అరి’ హిట్ కావాలి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
అనస్యూ భరద్వాజ్, సూర్య పురిమెట్ల, వినోద్ వర్మ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘చిన్నారి కిట్టయ్య’అనే పాటను బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అరి’ సినిమాలో 'చిన్నారి కిట్టయ్య' పాట మంగ్లీ వెర్షన్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. -
కొండా విశ్వేశ్వరరెడ్డికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరష్కరించింది. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్బంధించిన సంఘటనలో కొండా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. అయితే అజ్ఞాతంలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం గత వారం రోజులుగా బంజారాహిల్స్ పోలీసులు వెతుకుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సన్నిహితుడు సందీప్ రెడ్డి వద్ద పది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బంజారాహిల్స్‌లోని విశ్వేశ్వరరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా అనుచరులు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్భందించారు. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అప్పటినుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. రెండు రోజుల క్రితమే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
‘ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసే’..
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసి దుర్మార్గాలకు తెర లేపాడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంత ఇళ్ల నిర్మాణం పేరుతో తన డబ్బులతోనే నిర్మించినట్టు కేశవ్ డబ్బాలు కొట్టుకుంటున్నాడని మండిపడ్డారు. ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల్లో ఏనాడూ పేద ప్రజలు గుర్తుకు రాని కేశవ్‌కు.. ఇప్పుడే గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రజలు అనేక పోరాటాలు చేసి రోడ్డెక్కితే ఏనాడైనా ఈ సమస్యపై ప్రజలను కలిసావా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని ఇప్పుడు పేదలపై కేశవ్ దొంగ ప్రేమ ఒలకబోస్తూన్నాడన్నారు. టీడీపీ నేతలతో హౌసింగ్ మంజూరు పత్రాలు పంపిణీ చేయిస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరోసారి ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు. -
ఆ వార్తల్లో నిజం లేదు : ఉపాసన
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రామ్ చరణ్ అప్డేట్స్నే కాకుండా తన వృత్తికి, అపోలో హాస్పిటల్స్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ పత్రికలో వచ్చిన వార్తను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిపై తాను టీఆర్ఎస్ తరుపున పోటీచేస్తున్నట్లుగా వచ్చిన వార్తను ఉపాసన ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని.. తాను ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను ప్రేమిస్తున్నానని సంగీతా రెడ్డి(కొండ విశ్వేశ్వర రెడ్డి భార్య) తన బాస్ అంటూ చెప్పుకొచ్చారు. చిన్నాన్న(విశ్వేశ్వర రెడ్డి) చేవెళ్లలో మంచి పనులు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇటీవలె దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో ఉపాసన పాల్గొన్న సంగతి తెలిసిందే. -
‘అందుకే విశ్వేశ్వరరెడ్డి పార్టీ వీడారు’
సాక్షి, మహబూబాబాద్ : ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ విశ్వేశ్వరరెడ్డికి సముచిత స్థానం కల్పించిందని, ఎంపీగా గెలిపించి.. అత్యధిక సార్లు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించిందన్నారు. ఆర్థికంగా లబ్ధిపొంది ఇప్పుడు సిద్ధాంతాల పేరుతో రాద్ధాంతం చేయటం తగదని హితవు పలికారు. టీఆర్ఎస్.. సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందంటున్న విశ్వేశ్వరరెడ్డి ఈ నాలుగేళ్లు ఏమి చేశారని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డితో భూముల వివాదం కారణంగానే కొండా పార్టీ మారారన్నారు. మహేందర్ రెడ్డి తెలంగాణ ద్రోహి అయితే ఆయనతో కలిసి ఎంపీగా ఎలా పోటీ చేశావని ప్రశ్నించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచి తన మనషులైన పైలెట్ రోహిత్ రెడ్డి, కేఎస్ రత్నం, కనకయ్యలను ఇతర పార్టీలకు పంపారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ప్రాజెక్టును ఆపాలని కేంద్రాన్ని కోరింది చంద్రబాబు కాదా..? పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలతో కలిసి ఎలా పని చేస్తావ్..? అంటూ ప్రశ్నించారు. ఏ సిద్ధాంతాలతో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
'బీమాలో ఎఫ్‌డీఐలతో నష్టం లేదు'
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల ఎలాంటి నష్టం లేదని టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభలో ఆయన బీమా సవరణ బిల్లుపై బుధవారం మాట్లాడారు. ఎఫ్‌డీఐల వల్ల నష్టమేమీ కనిపించడం లేదని, పైగా దాదాపు 3 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 15 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా పంటల బీమా విషయంలో రైతులు భరించలేని ప్రీమియం ఉండడంతో వాళ్లు చెల్లించలేకపోతున్నారని వివరించారు. -
ఎంపీకి బెదిరింపు కాల్స్ ఘటన:ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి బెదిరింపు కాల్స్ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈనెల 18వ తేదీన విశ్వేశ్వరరెడ్డి సైబారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజేష్,, వెంకట రామిరెడ్డి అనే ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు లెక్కలు చూపించారంటూ బెదిరింపులకు పాల్పడి.. తమకు రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కొండారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ధైర్యాన్ని పెంపొందించుకోవాలి
మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మొయినాబాద్ రూరల్: విద్యార్థులు బా ల్యం నుంచే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలో ఉన్న హార్స్ రైడింగ్ శిక్షణ సంస్థలో శనివారం అండర్-25, అండర్-16 విభాగాల్లో పో టీలు నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. హార్స్‌రైడింగ్‌తో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని హార్స్ రైడింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అబ్బాస్, మిక్కెల్‌లు మొదటి స్థానంలో, ప్రవీణ్, అలెన్, రాజు, అంగన్, గోపన్నలు రెండో స్థానంలో, విశాల్రావు తృతీయ స్థానంలో నిలి చారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. అంనంతరం కార్యక్రమంలో సినీనటుడు నాగార్జున కుమారుడు అఖిల్, హార్స్ రైడింగ్ సంస్థ నిర్వాహకులు చేతన్‌బాబు, అజీజ్‌నగర్ సర్పంచ్ మంగ రాములు, నాయకులు మల్లారెడ్డి, ఖాసీంఖాన్, రిటెర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్‌యాదవ్ తదితరులున్నారు. -
కొండంత కుబేరుడు!
చేవెళ్ల లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల విలువ రూ.528 కోట్లు ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పణ సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి (కేవీఆర్) భారీ మొత్తంలో ఆస్తుల వివరాలను వెల్లడించారు. భార్య, ముగ్గురు కుమారులు, తన పేరిట మొత్తం రూ.528 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు వివరించారు. నగదు, బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో వాటాలు, స్థిరాస్తులు మొత్తం కలిపి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 528 కోట్ల, 62లక్షల, 30వేల, 210 విలువ చేసే సంపద ఉన్నట్లు శనివారం ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో తన పేరిట రూ. 171కోట్ల, 72 లక్షల, 69 వేల 324, ఆయన భార్య, అపోలో ఆస్పత్రుల ఎం.డి. సంగీతారెడ్డి పేరిట రూ.243 కోట్ల, 27 లక్షల, 40 వేల 262, ముగ్గురు కుమారుల పేరుపై రూ.63 కోట్ల, 90 లక్షల, 60వేల 724 ఆస్తులున్నాయని వివరించారు. తమ ఆస్తిలో సింహభాగం అపోలో ఆస్పత్రుల్లో వాటాల రూపంలో ఉందని తెలిపారు. ఆంధ్రా పెట్రో, దిఆంధ్రా షుగర్స్, సిటాడెల్ రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్, స్టెఫాన్ డిజైన్స్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్, హెల్త్క్యూర్ ఇండియా లిమిటెడ్, కార్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ వంటి సంస్థల్లో ఈ దంపతులకు రూ.కోట్ల వాటాలున్నాయి. 50ఎకరాల వ్యవసాయ భూమితోపాటు, హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో రూ.కోట్ల విలువైన నివాస, వాణిజ్య భవనాలను కేవీఆర్ ఆస్తుల జాబితాలో చూపించారు. సంగీతారెడ్డికి రూ.3కోట్ల విలువైన బం గారు, వజ్రాభరణాలు ఉన్నాయి. ఇన్ని కోట్ల ఆస్తులున్నప్పటికీ కుటుంబ సభ్యులెవరికీ వ్యక్తిగత కార్లుగానీ, ఇతర వాహనాలుగానీ లేవని అఫిడవిట్లో పేర్కొనడం విశేషం. -
కారు.. తకరారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఒంటరిగా బరిలో దిగాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ వారంలో తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఆ పార్టీ.. మొదటి విడతలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల చేరికతో మంచి ఊపు మీదున్న గులాబీ దండు జిల్లాలో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆక ర్షించడం ద్వారా సాధారణ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను నమోదు చేయాలని భావి స్తోంది. పరిగి, తాండూరు, చేవెళ్ల ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో బలీయంగా త యారవుతోంది. దక్షిణ తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించునేలా వ్యూహ రచన చేస్తున్న టీఆర్ఎస్.. వలసలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా జిల్లాలో బలంగా ఉన్న టీడీపీని దారుణంగా దెబ్బతీసింది. ఇదే దూకుడును ప్రదర్శించేందుకు మరికొందరు కాంగ్రెస్ నాయకులపై కన్నేసింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్న గులాబీ దళం.. వారం రోజుల్లోగా ఈ చేరికలను కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా కుత్బుల్లాపూర్, మేడ్చల్, మహేశ్వరం అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నందున.. వీటిపై ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోవద్దని నిర్ణయించింది. ఎల్బీనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డిని బరిలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే, వయోభారం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయన విముఖత చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు కారెక్కేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇక్కడ అభ్యర్థుల జాబితా మారే అవకాశం లేకపోలేదు. వికారాబాద్ నుంచి విద్యార్థి నేత పిడమర్తి రవిని బరిలోకి దింపాలని భావిస్తున్నప్పటికీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా ఆనంద్ వ్యవహరిస్తున్నారు. తాజాగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సంజీవరావు కూడా పార్టీలో చేరారు. వీరివురినీ కాదని స్థానికేతరుడికి సీటిస్తే ఒప్పుకొనేది లేదని స్థానిక నాయకత్వం హెచ్చరిస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైనా... మల్కాజిగిరి విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.