హరీష్‌రావు
మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మొయినాబాద్ రూరల్: విద్యార్థులు బా ల్యం నుంచే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలో ఉన్న హార్స్ రైడింగ్ శిక్షణ సంస్థలో శనివారం అండర్-25, అండర్-16 విభాగాల్లో పో టీలు నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. హార్స్‌రైడింగ్‌తో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని హార్స్ రైడింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అబ్బాస్, మిక్కెల్‌లు మొదటి స్థానంలో, ప్రవీణ్, అలెన్, రాజు, అంగన్, గోపన్నలు రెండో స్థానంలో, విశాల్‌రావు తృతీయ స్థానంలో నిలి చారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. అంనంతరం కార్యక్రమంలో సినీనటుడు నాగార్జున కుమారుడు అఖిల్, హార్స్ రైడింగ్ సంస్థ నిర్వాహకులు చేతన్‌బాబు, అజీజ్‌నగర్ సర్పంచ్ మంగ రాములు, నాయకులు మల్లారెడ్డి, ఖాసీంఖాన్, రిటెర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్‌యాదవ్ తదితరులున్నారు.