న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల ఎలాంటి నష్టం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభలో ఆయన బీమా సవరణ బిల్లుపై బుధవారం మాట్లాడారు. ఎఫ్‌డీఐల వల్ల నష్టమేమీ కనిపించడం లేదని, పైగా దాదాపు 3 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 15 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా పంటల బీమా విషయంలో రైతులు భరించలేని ప్రీమియం ఉండడంతో వాళ్లు చెల్లించలేకపోతున్నారని వివరించారు.