49% ఎఫ్ డీఐ నిబంధన నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: బీమా, పెన్షన్ రంగాల్లో ఆటోమేటిక్ రూట్‌లో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించే నిబంధనను వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దీనికి సంబంధించిన నిబంధనను తన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. బీమా, పెన్షన్ రంగాల్లో ఎఫ్‌డీఐ విధానాలను ప్రభుత్వం సరళీకరించిందని పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్-డిఐపీపీ) ఒక ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. గతంలో ఆటోమేటిక్ రూట్‌లో 26 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు అనుమతి ఉండేది. 49 శాతం వరకూ పెట్టుబడులు పెట్టాలంటే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఫారిణ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్) ఆమోదం పొందాల్సి వచ్చేది. కాగా భారత్‌లో ప్రస్తుతం 52 బీమా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిల్లో 24 జీవిత బీమా కంపెనీలు కాగా, 28 సాధారణ బీమా కంపెనీలు. గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ కాలానికి భారత్‌లోకి 2,944 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.