
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసి దుర్మార్గాలకు తెర లేపాడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంత ఇళ్ల నిర్మాణం పేరుతో తన డబ్బులతోనే నిర్మించినట్టు కేశవ్ డబ్బాలు కొట్టుకుంటున్నాడని మండిపడ్డారు. ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల్లో ఏనాడూ పేద ప్రజలు గుర్తుకు రాని కేశవ్‌కు.. ఇప్పుడే గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు.
ఇళ్ల స్థలాల కోసం ప్రజలు అనేక పోరాటాలు చేసి రోడ్డెక్కితే ఏనాడైనా ఈ సమస్యపై ప్రజలను కలిసావా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని ఇప్పుడు పేదలపై కేశవ్ దొంగ ప్రేమ ఒలకబోస్తూన్నాడన్నారు. టీడీపీ నేతలతో హౌసింగ్ మంజూరు పత్రాలు పంపిణీ చేయిస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరోసారి ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment