వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మైనారిటీల ద్రోహి అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ విమర్శించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు సేవ్ ఏపీ కాదు.. సేవ్ చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు దోపిడీ బయటపడిందని, టీడీపీ నేతలు అమరావతిలో 4000 ఎకరాలు కొనుగోలు చేశారని అన్నారు. చంద్రబాబు రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచారని ఆరోపించారు.
ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింలకు పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment