
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం దామరగిద్ద సమీపంలో బుధవారం ఉదయం ఓ కారులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో మంటలు రాగానే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బయటకు దూకడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు వెల్లడించారు. కారులో ఆరు మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పారు.