హతమైన రౌడీ షీటర్ నయీముద్దీన్ పై ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారిని వేధించినందుకు చేవెళ్ల సీఐ ఉపేంద్ర, ఎస్ఐ శేఖర్ ను సస్పెండ్ చేశారు.
రంగారెడ్డి: హతమైన రౌడీ షీటర్ నయీముద్దీన్ పై ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారిని వేధించినందుకు చేవెళ్ల సీఐ ఉపేంద్ర, ఎస్ఐ శేఖర్ ను సస్పెండ్ చేశారు. నయీం బారిన పడి నష్టపోయిన వారు బయటకు వచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయవచ్చని ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం ముఖ్య అధికారి నాగిరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
దాదాపు అన్ని జిల్లాల్లో నయీం బాధితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వారు బయటకు వచ్చి ఫిర్యాదులు కుప్పలుగా చేస్తున్నారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కూడా నయీం బాధితులు ఫిర్యాదులు చేసేందుకు రాగా సీఐ ఉపేంద్ర, ఎస్ఐ శేఖర్ వారిని వేధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిపై సస్పెండ్ వేటు వేశారు.