చేవెళ్ల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది ఇంద్రారెడ్డి కుటుంబమేనని మాజీ హోంమంత్రి, ఇంద్రారెడ్డి సతీమణి సబితారెడ్డి అన్నారు.
మొయినాబాద్ (చేవెళ్ల) : చేవెళ్ల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది ఇంద్రారెడ్డి కుటుంబమేనని మాజీ హోంమంత్రి, ఇంద్రారెడ్డి సతీమణి సబితారెడ్డి అన్నారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మొయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సబితారెడ్డి చేతులమీదుగా స్వర్గీయ ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేవెళ్ల ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన నేత ఇంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన ముందుండి పోరాడిన నాయకుడన్నారు. ఆయన ఆశయ సాధనకోసం కృషి చేయాలన్నారు. నివాళులర్పించిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు కొత్త నర్సింహ్మరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు షాబాద్ దర్శన్, మాజీ అధ్యక్షుడు మోత్కుపల్లి రాములు, పార్టీ జిల్లా కార్యదర్శి దారెడ్డి కృష్ణారెడ్డి, కిసాన్ ఖేత్ మజ్ధూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పురాణం వీరభద్రస్వామి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు మాధవరెడ్డి, గణేష్‌గౌడ్, యాదయ్య, కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, సర్పంచ్‌లు మల్లారెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు మాణయ్య, యాదయ్య, నాయకులు ఈగ రవీందర్‌రెడ్డి, ఎలిగేపల్లి శ్రీనివాస్‌యాదవ్, హన్మంత్‌రెడ్డి, పాషా, బాల్‌రాజ్, అంజిరెడ్డి, వడ్డె రాజు, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరులో...
మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న స్వర్గీయ ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంద్రారెడ్డి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో కిసాన్ ఖేత్ మజ్ధూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పురాణం వీరభద్రస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్త నర్సింహ్మరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు షాబాద్ దర్శన్, శ్రీరాంనగర్ మాజీ సర్పంచ్ మాణయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ మేకల జంగయ్య, నాయకులు బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాములు, చదువు కృష్ణ, జకరయ్య, జంగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.