Complete Schedule Of Amit Shah Tour In Telangana, Details Inside - Sakshi
Sakshi News home page

తెలంగాణలో అమిత్‌ షా పర్యటన.. పొలిటికల్‌ హీట్‌ పెంచిన బీజేపీ సభ

Published Fri, Apr 21 2023 3:52 PM | Last Updated on Fri, Apr 21 2023 4:11 PM

Complete Schedule Of Amit Shah Tour In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. ఈనెల 23వ తేదీన మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా బీజేపీ తలపెట్టిన చేవెళ్ల సభలో పాల్గొంటారు. అలాగే, నోవాటెల్‌ హోటల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. 

అమిత్‌ షా షెడ్యూల్‌ ఇదే..
- ఆదివారం(23న) మధ్యాహ్నం 3.30 గంటలకు అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
- మధ్యాహ్నం 3.50 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు.
- సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంతో సమావేశం అవుతారు. 
- సాయంత్రం 4.30 గంటల నుంచి 5.10 గంటల వరకు బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం అవుతుంది. 
- సాయంత్రం 5.15 గంటలకు అమిత్‌ షా చేవెళ్ల సభకు బయలుదేరుతారు. 
- సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమిత్‌ షా బహిరంగ సభలో పాల్గొంటారు. 
- తిరిగి రాత్రి 7.45 గంటలకు అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఢిల్లీకి పయనమవుతారు. 

పొలిటికల్‌ హీట్‌ పెంచిన అమిత్‌ షా పర్యటన..
అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర చిన్నపార్టీలు దూకుడు పెంచాయి. ఇలాంటి సమయంలో 23న చేవెళ్ల సభలో అమిత్‌షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను సవాల్‌ చేస్తూ.. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా ఈ సభ ఉండొచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement