
లిఫ్ట్ ఇస్తే.. బైక్ ఎత్తుకెళ్లాడు..!
పాపమని లిఫ్టిస్తే.. బెదిరించి బైక్‌ను ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలో జరిగింది.
చేవెళ్ల: పాపమని లిఫ్టిస్తే.. బెదిరించి బైక్‌ను ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చేవెళ్ల సీఐ ఉపేందర్, ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన పూలపల్లి యాదయ్య రాయల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 12న విధులు ముగించుకొని బైక్‌పై కళాశాల నుంచి ఆలూరుకు యాదయ్య బయలుదేరాడు. అయితే మెదక్ జిల్లా కొండాపూర్ మండలంలోని గుంతపల్లికి చెందిన వడ్డె యాదగిరి మార్గంమధ్యలో యాదయ్యను లిఫ్ట్ అడిగాడు. దీంతో యాదయ్య అతణ్ని బైక్‌పై ఎక్కించుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో దామరగిద్ద బస్‌స్టేజీ సమీపంలో మూత్ర విసర్జనకు బైక్ ఆపాలని యాదగిరి కోరాడు. అక్కడ బైక్ ఆపగానే యాదయ్యను బెదిరించి సెల్‌ఫోన్, బైక్ లాక్కొని పరారయ్యాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న యాదగిరిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. చోరీకి గురైన బైక్‌ను తిరిగి స్వాధీనం చేసుకొని పోలీసులు నిందితుణ్ని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు భాస్కర్, శంకరయ్య, అనంతయ్యలను సీఐ ఉపేందర్, ఎస్సై రాజశేఖర్‌లు అభినందించారు.