రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి  | Three Friends Lost Breath In Road Accident At Chevella | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి 

Published Mon, Jun 1 2020 3:25 AM | Last Updated on Mon, Jun 1 2020 4:20 AM

Three Friends Lost Breath In Road Accident At Chevella - Sakshi

చేవెళ్ల: ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా బాల్య స్నేహితులే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఆదివారం ఓ కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన సార నరేశ్‌ (30), గారెల రవీందర్‌ (32), ఎన్కేతల రఘు (30) అక్కడికక్కడే మృతి చెందారు. నర్కుడ నవీన్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. 2005 సంవత్సరం టెన్త్‌ బ్యాచ్‌కు చెందిన వీరు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామం నుంచి నరేశ్‌కు చెందిన కారులో సరదాగా చేవెళ్లకు వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు గ్రామానికి పయనమయ్యారు. 10 నిమిషాల్లో గ్రామానికి చేరుకుంటారనగా.. మార్గమధ్యలో మీర్జాగూడ బస్‌ స్టేజీ దాటిన తర్వాత అతివేగంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన మర్రిచెట్టును ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నవీన్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement