three friends
-
Road Accident : ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం...
(కాకినాడ జిల్లా): కాకినాడ జిల్లా తొండంగి మండలం జి.ముసలయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన ముగ్గు రు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తొండంగి ఎస్సై రవికుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురానికి చెందిన పోలవరపు కిరణ్ (23), పసుపులేటి దుర్గా శివప్రసాద్ (20), కాకర వీరబాబు(21) స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి బుధవారం రాత్రి బైకుపై స్వగ్రామం నుంచి బీచ్‌రోడ్డు మీదుగా అన్నవరంలో జరిగే స్నేహితుని వివాహానికి బయలుదేరారు. వేమవరం, యర్రయ్యపేట మీదుగా ముగ్గురూ వస్తుండగా జి.ముసలయ్యపేట వద్ద వీరి బైకు ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో పోలవరపు కిరణ్, కాకర వీరబాబులు సంఘటన స్ధలంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. దుర్గా శివప్రసాద్‌కు తీవ్రగాయాలై ప్రాణాపా య స్ధితిలో ఉండగా స్ధానికులు తుని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కన్నవారికి కడుపు కోత ఒకరికి తల్లిదండ్రుల్లేరు. మరొకరికి తండ్రి లేడు. ఇంకొకరికి తండ్రి ఉన్నా.. అతని అండ లేదు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడై ఉండేవారు. కష్టపడి పనిచేసుకుంటూ తమ కుటుంబాలకు అండగా ఉన్నారు. వయసులో వారి మధ్య ఏడాది, రెండేళ్ల వ్యత్యాసమే. ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం. అలాంటి మిత్రులను మృత్యువు కూడా ఒకేసారి కాటేసింది. దీంతో ఒకే రోజు మూడు కుటుంబాల్లో విషాదం నెలకొని, గ్రామం మూగబోయింది. దుర్గాశివప్రసాద్కు తల్లిదండ్రుల్లేరు. చిన్నప్పటి నుంచి మేనత్త రమణమ్మ వద్దే ఉంటున్నాడు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే మిల్లర్ పని చేస్తూ, ఆమెకు భరోసాగా ఉన్నాడు. ఇతని మరణంతో మేనత్త రమణమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కిరణ్‌కుమార్‌కు తల్లి లక్ష్మి, సోదరి హరిణి ఉన్నారు. తండ్రి బతికే ఉన్నా.. ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు. తల్లి స్థానికంగా ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో కూలిపని చేస్తుంది. సోదరి దివ్యాంగురాలు కావడంతో ఆశలన్నీ కిరణ్మీదే పెట్టుకున్నారు. కిరణ్ గ్రామంలో కూలి పనులతోపాటు, పెయింటింగ్ పనులకు వెళ్తుంటాడు. త్వరలోనే పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూస్తున్నారు. అలాంటి సమయంలోనే తమకు అందరాని దూరాలకు పోయిన కిరణ్‌ను తలచుకుంటూ ఆ తల్లి, కూతుళ్ల శోకం ఊరంతటినీ పట్టి కుదిపేస్తోంది. కాకర వీరబాబు మిల్లర్ పనితోపాటు, వ్యాన్ డ్రైవింగ్ చేస్తుంటాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. తండ్రి దారబాబు ఇంటి వద్దనే ఉంటాడు. తల్లి మేరీ గల్ఫ్‌లో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. కొడుకు మరణవార్త తెలుసుకుని ఆ తల్లి అక్కడి నుంచి బయలుదేరినట్టు తెలిసింది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి
చేవెళ్ల: ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా బాల్య స్నేహితులే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఆదివారం ఓ కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన సార నరేశ్ (30), గారెల రవీందర్ (32), ఎన్కేతల రఘు (30) అక్కడికక్కడే మృతి చెందారు. నర్కుడ నవీన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. 2005 సంవత్సరం టెన్త్ బ్యాచ్‌కు చెందిన వీరు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామం నుంచి నరేశ్‌కు చెందిన కారులో సరదాగా చేవెళ్లకు వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు గ్రామానికి పయనమయ్యారు. 10 నిమిషాల్లో గ్రామానికి చేరుకుంటారనగా.. మార్గమధ్యలో మీర్జాగూడ బస్ స్టేజీ దాటిన తర్వాత అతివేగంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన మర్రిచెట్టును ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నవీన్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలుష్యం నుంచి కళాఖండాల సృష్టి
వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల ప్రమాదమే తప్ప ప్రయోజనం ఏమీ లేదని మనం ఇంతకాలం భావిస్తూ వచ్చాం. కానీ వాహనాల గొట్టాల నుంచి వెలువడే పొగను పట్టి, బంధించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడమే కాకుండా బంధించిన కర్బన ఉద్గారాల నుంచి కళాఖండాలను సృష్టించేందుకు, పెన్నులో సిరాగా నింపుకొని రాసుకునేందుకు వీలుందని బెంగళూరుకు చెందిన ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామిక మిత్రులు నిరూపించారు. అనిరుధ్ శర్మ, నిఖిల్ కౌషిక్, నితేష్ కండ్యన్ అనే ఆ ముగ్గురు మిత్రులు గ్రావికీ ల్యాబ్స్‌ను ఏర్పాటుచేసి కర్బన ఉద్గారాలను పెయింటింగ్ సిరాగా ఎలా మార్చవచ్చో నిరూపించి చూపారు. వాహనాల గొట్టాల నుంచి పొగల రూపంలో వెలువడే కర్బన ఉద్గారాలను సేకరించేందుకు వారు 'కాలింక్' అనే గుడ్రటి ఆకారం గల ఓ గొట్టాన్ని తయారు చేశారు. వీటిని వాహనాల పొగగొట్టాలకు అమరుస్తారు. వీటి గోడలు కర్బనాలను పీల్చుకొని మిగతా గాలిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దానివల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు కలవవు. అనంతరం కాలింక్లను వాహనాల నుంచి తొలగించి ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ కాలింక్ల నుంచి కర్బన ఉద్గారాలను సేకరించి రసాయనిక ప్రక్రియ ద్వారా సిరాగా మారుస్తారు. ఆ సిరాను పెన్నుల్లో రాసుకునేందుకు, పెయింటింగ్స్‌కు వాయిల్స్ రూపంలో వినియోగించవచ్చు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మహారాష్ట్ర పర్యావరణ శాఖ ట్రాఫిక్ కూడళ్ల వద్ద కాలుష్యం పీల్చుకునే పరికరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించిందని, వాతావరణంలో కర్బన ఉద్గారాలు కలిశాక మాత్రమే ఆ పరికరాలు వాటిని పీల్చుకుంటాయని, వాతావరణంలో కలవడాని కన్నా ముందే వాహనాల వద్దనే ఈ కర్బన ఉద్గారాలను సేకరించడం మంచిదనే ఆలోచనలో నుంచి తమ ప్రాజెక్టు మొదలైందని నిఖిల్ అనే యువకుడు వివరించారు. ఈ ముగ్గురు 2,500 గంటలపాటు వాహనాల నుంచి వెలువడిన కాలుష్య ఉద్గారాల నుంచి 150 లీటర్ల ఎయిర్-సిరాను తయారుచేశారు. పెద్ద ఎత్తున ఈ సిరాను ఫ్యాక్టరీల స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ప్రభుత్వ విధాన నిర్ణయాలు తప్పనిసరని వారు చెప్పారు. తమ సిరాను ఉపయోగించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ముందుకొచ్చారని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విషయంలో అమెరికాలోని పలు రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయని వారు చెప్పారు. ఏ దేశ ప్రభుత్వాలు సహకరించినా తాము పెట్రోలు బంకుల వద్ద ఈ 'కాలింక్'లను విక్రయించగలమని, మళ్లీ వాటివద్దే కర్బన ఉద్గారాలతో కూడిన కాలింక్లను సేకరించగలమని వారు చెప్పారు. ఈ ఆధునిక టెక్నాలజీ ఆలోచన వాస్తవానికి అనిరుధ్దని, ఆయన అమెరికాలోని ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్నప్పుడు మూడేళ్ల క్రితం కలిగిందని, ఇప్పుడు ముగ్గురం కలసి ప్రాజెక్టుపై ప్రయోగాలు చేయడం ద్వారా ఇప్పుడు ఈ టెక్నాలజీ విషయంలో విజయం సాధించామని మిగతా ఇద్దరు మిత్రులు వివరించారు. నిఖిల్ చార్టర్డ్ అకౌంటెంట్ కాగా, అనిరుధ్, నితేష్‌లు ఇంజనీర్లు. -
వీళ్లు.. 100 పర్సెంట్ బెస్ట్ ఫ్రెండ్స్!
బాల్యం, పాఠశాల విద్య, కాలేజీ.. ఆ తర్వాత ఉద్యోగం, వ్యాపారం లేదా ఏదైన వృత్తి.. ఇలా ఓ మనిషి జీవిత ప్రయాణంలో ఊళ్లు మారాల్సి రావచ్చు. ఈ క్రమంలో ఎందరో స్నేహితులవుతారు. చిన్ననాటి స్నేహం జీవితాంతం కొనసాగించవచ్చు.. కానీ వందో పుట్టినరోజు వేడుకలు చేసుకునే బాల్యమిత్రులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అమెరికాలో ముగ్గురు స్నేహితురాళ్లు వందో జన్మదిన వేడుకలు చేసుకుని తమ స్నేహం 100 పర్సెంట్ బెస్ట్ అని చాటిచెప్పారు. వీరి కొడుకులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు అందరూ ఒక్క చోటకు చేరి గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేశారు. అరుదైన స్నేహితురాళ్లు రుత్ చాట్మన్ హామ్మెట్, గ్లాడీస్ వేర్ బట్లర్, బెర్నిసె గ్రౌమ్స్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 18న వాషింగ్టన్‌లోని ఓ చర్చిలో ఈ అపూర దృశ్యం ఆవిషృతమైంది. కాగా మరో స్నేహితురాలు లియోనా బార్నెస్ గత నెలలో మరణించింది. ఆమె లేకపోవడం ఈ ముగ్గురికి లోటుగా అనిపించింది. తమ బర్త్ డే వేడుకల్లో లియోనా ఫొటోను తమ పక్కన పెట్టుకుని నివాళులు అర్పించారు. ఈ నలుగురూ 1916లో జూన్ లేదా జూలైలో జన్మించారు. వందేళ్లుగా వీరి స్నేహం కొనసాగుతోంది. 16వ స్ట్రీట్ హైట్స్‌లోని చర్చికి వీరు క్రమం తప్పకుండా వచ్చేవారు. నలుగురూ కలసి వందో బర్త్ డేను గ్రాండ్‌గా చేసుకోవాలని భావించారు. అయితే లియోనా మే నెలలో మరణించింది. ఆమె మరణించడం మిగిలిన మగ్గురు స్నేహితరాళ్లను కలచివేసింది. లియోనా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రుత్ చాట్మన్ హామ్మెట్, గ్లాడీస్ వేర్ బట్లర్, బెర్నిసె గ్రౌమ్స్ వందో జన్మదిన వేడుకలు చేసుకున్నారు. చర్చిలో ఎప్పటిలాగా ఈ స్నేహితులు వరుసలో కూర్చుని తమ పక్క సీటుపై లియోనా ఫొటో ఉంచి పుష్పగుచ్చాలు ఉంచారు. లియోనా లేకపోవడం బాధాకరమైనా ముగ్గురం కలసి వందో జన్మదిన వేడుకలు చేసుకోవడం మధురానుభూతిని కలిగించిందని చెప్పారు. ఈ అపురూప స్నేహితులకు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. -
మరణంలోనూ వీడని స్నేహం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల దుర్మరణం హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణాపురానికి చెందిన సుంకరి సురేశ్(20), పట్టం వెంకటేశ్(21), ప్రభుదేవ్(19) స్నేహితులు. పదో తరగతి వరకు కలసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం సురేశ్, వెంకటేశ్ నగరానికి వచ్చారు. సురేశ్ నాగారంలో తన అన్న తిరుపతి వద్ద ఉంటూ తార్నాకలోని ప్రైవేట్ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. వెంకటేశ్ ఘట్కేసర్లోని మేథ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూ.. నాగారంలో స్నేహితులతో కలసి ఉంటున్నాడు. ప్రభుదేవ్ సూర్యాపేటలోని ప్రైవేట్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. స్నేహితులను చూడటానికి ప్రభుదేవ్ మంగళవారం నగరానికి వచ్చాడు. ఈ సందర్భంగా నాగారంలోని వెంకటేశ్ రూమ్‌లో ముగ్గురూ కలసి పార్టీ చేసుకున్నారు. కాగా, బుధవారం తెల్లవారు జామున ఎస్పీనగర్ ప్రధాన రహదారిపై డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో ముగ్గూరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అతి వేగంతో బైక్ నడపడంతో అదుపుచేయలేక డివైడర్‌ను ఢీ కొట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాగారం నుండి తార్నాక వైపు వెళుతుండగా ప్రమాదం జరిగిందని, ప్రభుదేవ్‌ను బస్టాండ్‌లో దించడానికి వె ళుతుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నాకు కూడా తెలియదు: రూమ్మేట్ ప్రసాద్ వారు ముగ్గురూ తెల్లవారుజామున బయటకు వెళ్లిన విషయం తనకు కూడా తెలియదని వెంకటేశ్ రూమ్మేట్ ప్రసాద్ చెప్పాడు. తన బైక్ తాళం తీసుకెళ్లారని, రూమ్ తలుపు కూడా వేసిఉండటంతో ఇరుగుపొరుగువారు తలుపు తీశారని తెలిపాడు. సురేశ్ అన్న తిరుపతి మాట్లాడుతూ.. తన వద్దనే ఉండి సురేశ్ చదువుకుంటున్నాడని, అప్పుడప్పుడు వెంకటేశ్ రూమ్‌కు వెళ్లి వచ్చేవాడని చెప్పాడు. మంగళవారం రాత్రి ఇంటికి రాలేదని, ఆ రోజే తన తమ్ముడికి చివరిరోజు అవుతుందని ఊహించలేదని అతను రోదించాడు. -
ముగ్గురు మిత్రుల విషాదాంతం
లారీని ఢీకొన్న కారు డోన్ సమీపంలోని అమకతాడు వద్ద ఘటన టోల్‌ప్లాజా వద్ద స్పీడ్ బ్రేకర్లే కారణం ఘటనా స్థలిలోనే ముగ్గురి దుర్మరణం 20 రోజుల కూతురిని చూసేందుకు స్నేహితులతో వెళ్తుండగా ప్రమాదం మృతులంతా చిత్తూరు జిల్లావాసులు జీవనోపాధికి బెంగళూరులో నివాసం డోన్‌టౌన్/క్రిష్ణగిరి: కర్నూలు జిల్లా డోన్ పోలీసు సర్కిల్ పరిధిలోని అమకతాడు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో చిత్తూరు జిల్లావాసులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ శ్రీహరి తెలిపిన మేరకు.. చిత్తూరు పట్టణానికి చెందిన జగదీష్, అమర్నాథ్రెడ్డి, రాజేష్ కొన్నేళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. జగదీష్ చిత్తూరు, బెంగళూరు, బళ్లారి తదితర ప్రాంతాల్లో గ్రానైట్, ఇతర మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. అమర్నాథ్రెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రాజేష్ హోటల్ క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జగదీష్‌కు హైదరాబాద్‌కు చెందిన మీనాకుమారితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. 20 రోజుల క్రితం పాప జన్మించడంతో చూసొచ్చేందుకు ఆదివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అమర్నాథ్రెడ్డికి చెందిన డస్టర్ కారు(కేఈ 51 ఎండీ 4707)లో రాజేష్‌తో కలసి బయలుదేరారు. డోన్ మండల పరిధిలోని అమకతాడు టోల్‌ప్లాజా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో జగదీష్(35), అమర్నాథ్రెడ్డి(35), రాజేష్(35) అక్కడికక్కడే మృతిచెందారు. టోల్‌గేటు వద్దనున్న స్పీడు బ్రేకర్లే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ ప్రాంతంలో లైట్లు లేకపోవడంతో కూరగాయల లారీ స్పీడ్ బ్రేకర్లను దాటుతుండగా.. వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతుడు అమర్నాథ్రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా పాకాల తాలూకా మద్దినాయునిపల్లె. నాలుగేళ్ల క్రితం చంద్రగిరికి చెందిన కీర్తితో వివాహమైంది. ఈ దంపతులకు ఇరువురు సంతానం. క్యాటరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచిన బెంగళూరుకు చెందిన రాజేష్ మృతితో ఆయన తండ్రి పద్మనాభరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. త్వరలో పెళ్లి చేయాలని భావి స్తున్న తరుణంలో చోటు చేసుకున్న ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ డేగల ప్రభాకర్ పరిశీలించారు. టోల్‌ప్లాజా గన్‌మన్ సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈత.. విషాదం
వారు ముగ్గురు స్నేహితులు.. ఎప్పుడూ కలిసి తిరి గే వారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాఠశాలకు సెల వు ఇవ్వడంతో చెరువులో స్నానానికి వెళ్లారు. దురదృష్టవశాత్తు చెరువులో ఉన్న గుంతలో పడి నీట మునిగిపోయారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్నబిడ్డలు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు వారిని చూసి గుండెలవిసేలా రోది స్తున్నారు. ‘ఇక మాకెవరు దిక్కు బిడ్డా.. ఎవల కో సం బతకాలి’ అని వారు రోదిస్తున్న తీరు అందరి నీ కలిచివేస్తోంది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ము లున్నారు. ఈ హృదయ విదారక సంఘటన హుజూరాబాద్ మండలం కనుకులగిద్దలో శుక్రవారం జరిగింది. చింతకుంటలో జరిగిన మరో ప్రమాదంలో ఓ ఆరో తరగతి విద్యార్థి నీటి గుంతలో పడి చనిపోయాడు. హుజూరాబాద్ /హుజూరాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : హుజూరాబాద్ మండలం కనుకులగిద్దకు చెందిన అల్లి రమేశ్ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రమేశ్, పుష్పలత దంపతులకు రోహి త్ (12), ప్రణీత్ (10) ఇద్దరే సంతానం. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో రోహిత్ ఆరో తరగతి చదువుతుండగా, ప్రణీత్ నాలుగో తరగతి చదువుతున్నా డు. ఇదే గ్రామానికి చెందిన దాసరి చంద్రారెడ్డి, సరోజన దంపతుల ఒక్కగానొక్క కుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి(గణేశ్) (15) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వీరు ముగ్గురితోపాటు మరో ఇద్దరు శివాజీ, వినయ్ శుక్రవారం ఉదయం గిద్దె చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. రోహి త్, ప్రణీత్, గణేశ్ కలిసి చెరువులో దిగగా శివాజీ, వినయ్ ఒడ్డుపైనే కూర్చున్నారు. చెరువులో గుంత ఉన్న విషయాన్ని పసిగట్టలేక ముగ్గురు చిన్నారులు అందు లో మునిగారు. తాము మునిగిపోతున్నామని కేకలు వేయడంతో ఒడ్డుపై కూర్చున్న ఇద్దరు చిన్నారులు హు టాహుటిన గ్రామంలోకి పరుగెత్తుకొచ్చారు. ఈ విషయాన్ని అక్కడున్న వాళ్లకు చెప్పడంతో వారు చెరువు వద్దకు వెళ్లేసరికి ప్రణీత్, గణేశ్ నీటిలో పూర్తిగా మునిగి పోయారు. రోహిత్ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా బయటకు తీశారు. హుజూరాబాద్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో అత డు కూడా చనిపోయాడు. ప్రణీత్, గణేశ్‌ల ఆచూకీ కో సం చెరువులో గాలించగా వారి మృతదేహాలు కనిపిం చాయి. సంఘటన స్థలానికి హుజూరాబాద్ సీఐ శ్రీని వాస్, ఎస్సై జగదీశ్ వచ్చి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఒకే గ్రామానికి చెం దిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులకు కడుపు కోతే... అల్లి రమేశ్, పుష్పలత దంపతులు తమ కొడుకులు రోహిత్, ప్రణీత్‌లను అల్లారుముద్దుగా పెంచుకుంటూ కష్టపడి హుజూరాబాద్‌లో చదివిస్తున్నారు. కొడుకుల ను చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కడుపు కోతే మిగిలింది. ఒక్కగానొక్క కొడుకు. దాసరి చంద్రారెడ్డి, సరోజనలకు ఏకైక సంతానం గణే శ్. వీరిది వ్యవసాయ కుటుంబం. పెళ్లయిన తర్వాత ఆలస్యంగా జన్మించిన గణేశ్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కొడుకు కళ్లముందే ఉండాలని గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. చివరకు అతడు ఇలా చెరువులో తుది శ్వాస విడవడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సెలవు లేకున్నా బతికేవారు.. గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాఠశాలకు సెలవు ఇవ్వడం తోనే ఈ ఘటన జరిగిందని, సెలవు లేకున్నా పిల్లలు బతికేవారని వారు తల్లిదండ్రులు రోదిస్తున్నారు. చింతకుంటలో ఆరో తరగతి విద్యార్థి.. కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : బోయినపల్లి మండ లం విలాసాగర్‌కు చెందిన సల్లా లచ్చయ్య, లత దంపతుల చిన్న కుమారుడు సాయికుమార్(12) ఓ నీటి గుంతలో పడి చనిపోయాడు. వీరు చింత కుంట శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. సా యికుమార్ ధన్గర్వాడి పాఠశాలలో చదువుతు న్నాడు. శుక్రవారం సోదరుడు సతీష్, స్నేహితులు నవీన్, కుమార్‌తో కలిసి ఇంటి సమీపంలో ఉన్న లోతైన గుంతకు ఈత కొట్టడానికి వెళ్లాడు. మొద ట సాయికుమార్, కుమార్ లోపలికి దిగారు. దిగి న వెంటనే మట్టిజారి మునిగిపోయారు. గమనిం చిన సతీష్ పరుగెత్తుకెళ్లి సమీపంలో ఉన్న ఒడిశా కార్మికులకు చెప్పగా వారు కుమార్‌ను కాపాడారు. సాయికుమార్ అప్పటికే మునిగిపోయాడు. కాసే పటికి అతడి మృతదేహం కనిపించింది. కొడుకు మృతదేహాన్నిచూసి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. -
కలిసి రాణించారు.. కలిసే మరణించారు
ఏలేశ్వరం/మండపేట రూరల్/ పెదపూడి, న్యూస్‌లైన్ : జీవిత ప్రస్థానంలో ఒకేమాటగా, ఒకేబాటగా ముందంజ వేసిన ఆ ముగ్గురు మిత్రులనూ మృత్యువు ఒక్కసారే కబళించింది. ఒకరికొకరు అండగా.. అంచెలంచెలుగా ఎదిగిన వారు అంతిమప్రస్థానంలోనూ ఒకరికొకరు తోడయ్యారు. ఏలేశ్వరం మం డలం చిన్నింపేట జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు గుర్తు తెలియని వాహ నాన్ని ఢీకొని మండపేట మండలం అర్తమూరుకు చెందిన కడియాల శ్రీనివాస్ (39), పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన తమలంపూడి సురేష్‌బాబురెడ్డి(36), వెలగల నారాయణరెడ్డి(38) మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి, నారాయణరెడి పదేళ్లక్రితం శ్రీకాకుళం జిల్లా పలాసకు వలస వెళ్లారు. అక్కడ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగారు. హైదరాబాద్ కుకట్‌పల్లిలో ఇటీవల హోటల్ వ్యాపారం కూడా ప్రారంభించారు. వీరిలో సురేష్‌బాబురెడ్డి శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. రావులపాలెంలో బంధువుల ఇంట ఆదివారం జరిగే ఓ వేడుకలో పాల్గొనేందుకు శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి, నారాయణరెడ్డి శనివారం రాత్రి పలాస నుంచి కారులో బయలుదేరారు. ఆ ముగ్గురి స్నేహితుడైన పంచాయతీరాజ్‌శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ టి.నరసింహమూర్తి కూడా వారి వెంట వచ్చారు. ఆదివారం తెలవారుజామున సుమారు 3 గంటల సమయంలో చిన్నింపేట జంక్షన్ వద్ద వీరి కారును దాటుకుని వచ్చిన గుర్తు తెలియని వాహనం అకస్మాత్తుగా కుడివైపు తిరిగింది. దీంతో వీరి కారు ఆ వాహనాన్ని ఢీకొని నుజునుజ్జయింది. శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి అక్కడికక్కడే మరణించారు. నారాయణరెడ్డి, నరసింహమూర్తి, డ్రైవర్ ప్రసాద్‌కుమార్ మహంతి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. కారు లోంచి చేతులు బయటకు పెట్టి నరసింహమూర్తి చేస్తున్న ఆర్తనాదాలతో అక్కడకు చేరుకున్న స్థానికులు గాయపడ్డ ముగ్గురినీ 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నారాయణరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య గౌరి, కుమారుడు చందు, కుమార్తె రోజ్ ఉన్నారు. నారాయణరెడ్డికి భార్య శాంతిప్రియ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ప్రత్తిపాడు సీఐ రామ్మోహన్‌రెడ్డి, ఎస్సై గౌరీశంకర్, ట్రైనింగ్ ఎస్సై శంకర్ పరిశీలించారు. ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో నుజ్జయిన కారును గురైన వాహనాన్ని క్రేన్‌ద్వారా పక్కకు తొలిగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గొల్లలమామిడాడ, అర్తమూరు గ్రామాలకు తరలించారు. స్వంతజిల్లాకు వస్తూ మార్గమధ్యలో అశువులు బాసారు. వీరంతా పలాస నుంచి రావులపాలెం వస్తుండగా అర్తమూరు, మామిడాడల్లో విషాదఛాయలు ముగ్గురు మిత్రులను కబళించిన ప్రమాదంతో అర్తమూరు, గొల్లల మామిడాడ గ్రామాల్లో విషాదం అలముకుంది. శ్రీనివాస్ మృతితో దిక్కులేనివాళ్లమయ్యామని ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచి వేసింది. శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. శ్రీనివాస్ మృతదేహానికి ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా కుటుంబానికి పెద్ద దిక్కు అనుకున్న కొడుకును మృత్యువు అకాలంగా ప్రమాదం రూపంలో పొట్టన పెట్టుకుందంటూ సురేష్‌బాబురెడ్డి తల్లి వెంకటలక్ష్మి,తండ్రి జయరామ్చంద్రారెడ్డి రోదించారు. ప్రమాదవార్త తెలియగానే పలాస నుంచి తల్లిదండ్రులు, హైదరాబాద్ నుంచి సోదరి సుధారాణి మామిడాడ చేరుకున్నారు. వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే బంధువులు, ఇరుగుపొరుగు వారు కంటతడి పెట్టారు. కాగా పలాసలో ఉంటున్న కొడుకు కోడలు, మనుమలతో వస్తాడనుకుంటే ఇంటికి శవమై వచ్చాడంటూ నారాయణరెడ్డి తండ్రి భోరున విలపించాడు. ప్రమాదవార్త తెలియగానే నారాయణరెడ్డి భార్య, పిల్లలు పలాస నుంచి మామిడాడ బయలు దేరారు. -
రెండు బైకులు ఢీకొని ముగ్గురి దుర్మరణం
షాద్‌నగర్ టౌన్, న్యూస్‌లైన్: రోడ్డు ములుపులో అ తివేగంతో వచ్చిన రెండు బై కులు ఢీకొనడంతో ము గ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వి షాదకర సంఘటన బుధవా రం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కొందుర్గు మండలం ఆ గిర్యాల గ్రామానికి చెందిన సురేష్(20), సంతోష్, గఫార్ ము గ్గురు స్నేహితులు. సురేష్ షాద్‌నగర్ పట్టణంలోని బీఏఎం డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం స్నేహితులు ముగ్గురు కలిసి బైక్‌పై షాద్‌నగర్ పట్టణానికి వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు మూల మలుపులో కిషన్‌నగర్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తున్న మరో ైబె క్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై వెళ్తున్న వెంకటయ్య(40),గంగాధర్(40)లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి త రలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వెంకటయ్య మృతిచెందాడు. గం గాధర్ను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృ తి చెందాడు. వెంకటయ్య, గంగాధర్‌ను కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతవాసిగా పోలీసులు గుర్తించారు. షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి సీఐ సైదయ్య చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి బంధువుల రోదనలు పలువురి కంటతడి పెట్టించాయి. మృతుడు వెంకటయ్య, గంగాధర్ గ్రామాల్లో చెట్లను కొనుగోలు చేసి, వాటిని కాల్చగా వచ్చిన బొగ్గును విక్రయించి జీవనం కొనసాగించేవారు.