వీళ్లు.. 100 పర్సెంట్ బెస్ట్ ఫ్రెండ్స్! | Three friends celebrate their 100th birthdays together, while remembering a fourth | Sakshi
Sakshi News home page

వీళ్లు.. 100 పర్సెంట్ బెస్ట్ ఫ్రెండ్స్!

Published Wed, Jun 22 2016 4:03 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

వీళ్లు..  100 పర్సెంట్ బెస్ట్ ఫ్రెండ్స్!

వీళ్లు.. 100 పర్సెంట్ బెస్ట్ ఫ్రెండ్స్!

బాల్యం, పాఠశాల విద్య, కాలేజీ.. ఆ తర్వాత ఉద్యోగం, వ్యాపారం లేదా ఏదైన వృత్తి.. ఇలా ఓ మనిషి జీవిత ప్రయాణంలో ఊళ్లు మారాల్సి రావచ్చు. ఈ క్రమంలో ఎందరో స్నేహితులవుతారు. చిన్ననాటి స్నేహం జీవితాంతం కొనసాగించవచ్చు.. కానీ వందో పుట్టినరోజు వేడుకలు చేసుకునే బాల్యమిత్రులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అమెరికాలో ముగ్గురు స్నేహితురాళ్లు వందో జన్మదిన వేడుకలు చేసుకుని తమ స్నేహం 100 పర్సెంట్ బెస్ట్ అని చాటిచెప్పారు.

వీరి కొడుకులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు అందరూ ఒక్క చోటకు చేరి గ్రాండ్గా సెలెబ్రేషన్స్ చేశారు. అరుదైన స్నేహితురాళ్లు రుత్ చాట్మన్ హామ్మెట్, గ్లాడీస్ వేర్ బట్లర్, బెర్నిసె గ్రౌమ్స్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 18న వాషింగ్టన్లోని ఓ చర్చిలో ఈ అపూర దృశ్యం ఆవిషృతమైంది. కాగా మరో స్నేహితురాలు లియోనా బార్నెస్ గత నెలలో మరణించింది. ఆమె లేకపోవడం ఈ ముగ్గురికి లోటుగా అనిపించింది. తమ బర్త్ డే వేడుకల్లో లియోనా ఫొటోను తమ పక్కన పెట్టుకుని నివాళులు అర్పించారు.

ఈ నలుగురూ 1916లో జూన్ లేదా జూలైలో జన్మించారు. వందేళ్లుగా వీరి స్నేహం కొనసాగుతోంది. 16వ స్ట్రీట్ హైట్స్లోని చర్చికి వీరు క్రమం తప్పకుండా వచ్చేవారు. నలుగురూ కలసి వందో బర్త్ డేను గ్రాండ్గా చేసుకోవాలని భావించారు. అయితే లియోనా మే నెలలో మరణించింది. ఆమె మరణించడం మిగిలిన మగ్గురు స్నేహితరాళ్లను కలచివేసింది. లియోనా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రుత్ చాట్మన్ హామ్మెట్, గ్లాడీస్ వేర్ బట్లర్, బెర్నిసె గ్రౌమ్స్ వందో జన్మదిన వేడుకలు చేసుకున్నారు. చర్చిలో ఎప్పటిలాగా ఈ స్నేహితులు వరుసలో కూర్చుని తమ పక్క సీటుపై లియోనా ఫొటో ఉంచి పుష్పగుచ్చాలు ఉంచారు. లియోనా లేకపోవడం బాధాకరమైనా ముగ్గురం కలసి వందో జన్మదిన వేడుకలు చేసుకోవడం  మధురానుభూతిని కలిగించిందని చెప్పారు. ఈ అపురూప స్నేహితులకు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement