షాద్‌నగర్ టౌన్, న్యూస్‌లైన్: రోడ్డు ములుపులో అ తివేగంతో వచ్చిన రెండు బై కులు ఢీకొనడంతో ము గ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వి షాదకర సంఘటన బుధవా రం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామ సమీపంలో జరిగింది.
స్థానికుల కథనం మేరకు.. కొందుర్గు మండలం ఆ గిర్యాల గ్రామానికి చెందిన సురేష్(20), సంతోష్, గఫార్ ము గ్గురు స్నేహితులు. సురేష్ షాద్‌నగర్ పట్టణంలోని బీఏఎం డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం స్నేహితులు ముగ్గురు కలిసి బైక్‌పై షాద్‌నగర్ పట్టణానికి వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు మూల మలుపులో కిషన్‌నగర్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తున్న మరో ైబె క్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై వెళ్తున్న వెంకటయ్య(40),గంగాధర్(40)లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి త రలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వెంకటయ్య మృతిచెందాడు.
గం గాధర్‌ను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృ తి చెందాడు. వెంకటయ్య, గంగాధర్‌ను కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతవాసిగా పోలీసులు గుర్తించారు. షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి సీఐ సైదయ్య చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి బంధువుల రోదనలు పలువురి కంటతడి పెట్టించాయి. మృతుడు వెంకటయ్య, గంగాధర్ గ్రామాల్లో చెట్లను కొనుగోలు చేసి, వాటిని కాల్చగా వచ్చిన బొగ్గును విక్రయించి జీవనం కొనసాగించేవారు.
రెండు బైకులు ఢీకొని ముగ్గురి దుర్మరణం
Published Thu, Aug 29 2013 6:13 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement