shadhnagar
-
ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ ఉదంతానికి సంబంధించి శుక్రవారం షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న షాద్ నగర్ ఏసీపీ వి.సురేంద్ర ఫిర్యాదు మేరకు హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కింద కేసు నమోదు చేశారు. నిందితులను తీసుకుని నేర ఆధారాల సేకరణకు చటాన్‌పల్లిలోని ఘటనా స్థలానికి వెళ్లామని, అక్కడ నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారని, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు హతమైనట్లు వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు దాని ప్రతిని ఆధీకృత న్యాయస్థానానికి సమర్పించారు. మరోపక్క దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఓ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర హోంశాఖకు పంపాయి. చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ కాగా గాయపడిన పోలీసులు హైటెక్‌సిటీలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేర్ హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ 'నిందితుల రాళ్ల దాడిలో ఎస్ఐ వెంకటేశ్వర్లు తలకు గాయమైంది. కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్ కుడి భుజంపై కర్ర గాయాలయ్యాయి. ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఎస్ఐ, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని' తెలిపారు. ఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం వెతుకులాట ఎన్కౌంటర్ ప్రదేశంలో పోలీసులు ఉపయోగించిన బుల్లెట్ల కోసం రెండోరోజు కూడా వెతుకులాడుతున్నారు. నలుగురు నిందితులకు 11 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఘటన జరిగిన ప్రదేశంలో పడిన బుల్లెట్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. డీప్ మెటల్ డిటెక్టర్‌తో బుల్లెట్ల కోసం బాంబ్ స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. నిన్న రాత్రి నుంచి సంఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
నలుగురు మృగాళ్ల కథ ముగిసింది..
సాక్షి, హైదరాబాద్ : అభం, శుభం తెలియని వెటర్నరీ వైద్యురాలు దిశపై దారుణానికి పాల్పడ్డ పదో రోజు నలుగురు మృగాళ్ల కథ ముగిసింది. దేశం నినదించిందే నిజమయింది. దిశపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు చివరకు పోలీసుల తూటాలకు బలయ్యారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై దాడిచేసేందుకు యత్నం చేశారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే హతమయ్యారు. గత నెల 27న దిశను నిందితులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. కేసులో తాము పట్టపడకుండా తప్పించుకునేందుకు..దిశను తగలబెట్టారు. నవంబర్ 28న నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..29న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో విచారించారు. నవంబర్ 30న నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. చర్లపల్లి జైలుకు వారిని తరలించారు. ఈనెల 4న నిందితులను షాద్‌నగర్ కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఘటనపై నిన్న నిందితులను సిట్ విచారించింది. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు నిందితులను ఘటనా స్థలానికి పోలీసులు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో గత రెండు రోజుల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం జరిగిందంటూ విమర్శలు రావడంతో నిందితులను షాద్‌నగర్ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయాన్ని లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటించాయి. మరోవైపు మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారంపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు అర్ధరాత్రి ప్రాంతంలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా పోలీసులు తరలించారు. తొలుత తొండుపల్లి టోల్గేట్ ప్రాంతంలో ఘటనాస్థలానికి నిందితులను తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలించారు. దిశను ముందు చూసిందెవరు..? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది..?.. తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల నుండి ఆయుధాలు లాక్కునేందుకు యత్నించారు. వీలుకాకపోవడంతో పక్కనే ఉన్న రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎన్కౌంటర్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా మృతదేహాలకు సంఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో దిశ నివాసం వద్ద భద్రతను పెంచారు. ఒక ఎస్ఐ, ముగ్గురు మహిళా, నలుగురు పురుష కానిస్టేబుల్స్‌తో భద్రత ఏర్పాటు చేశారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించవద్దని స్పెషల్ టీమ్‌కు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. గుంపుగా వచ్చి ఎవరైనా దాడికి పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దిశ ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇక దిశ నిందితులకు ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. నిందితులకు సరైన శిక్ష పడిందని మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. కళాశాలల విద్యార్థినుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దిశ ఆత్మకు శాంతి కలిగిందని, కామాంధుల ఎన్‌కౌంటర్‌తో జనజీవన స్రవంతిలో ఉన్న మానవ మృగాల గుండెల్లో దడ పుట్టించేలా ఉందని అన్నారు. టపాసులు పంచుతూ, స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ? ‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు.. ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి’ పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది: మనోజ్ -
నాలుగు మృతదేహాలకు పంచనామా
సాక్షి, హైదరాబాద్ : శాంతి భద్రతల దృష్ట్యా దిశ నిందితుల మృతదేహాలకు ఎన్కౌంటర్ చేసిన ప్రదేశంలోనే గాంధీ ఆస్పత్రి వైద్యులు పంచనామా నిర్వహించారు.. స్థానిక ఫరూక్ నగర్ ఎమ్మార్వో, ఆర్డీవోల సమక్షంలో శుక్రవారం పోలీసులు పంచనామా జరిపి, అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ... ‘నాలుగు మృతదేహాలు 20 నుంచి 30 అడుగుల దూరంలో పడి ఉన్నాయి. మృతదేహాలకు పంచనామా నిర్వహించాం’ అని తెలిపారు. కాగా ఘటనా స్థలంలో క్లూస్ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పంచనామా జరిగిన అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం నాలుగు మృతదేహాలను ఫరుక్ నగర్ కుందూర్, నందిగామ, చౌదరిగూడ ఎమ్మార్వోలకు అప్పగించారు. మరోవైపు మృతదేహాలకు మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. గుడిగండ్లలో భారీ బందోబస్తు మరోవైపు వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ? -
కార్మికుల భద్రత గాల్లో దీపం!
పరిశ్రమల్లో కార్మికుల భద్రత గాల్లో దీపంగా మారింది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో ఎరుగరు. పరిశ్రమల యజమానులు అభాగ్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రక్షణచర్యలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుని కార్మికులు మృత్యువాతపడుతున్నారు. మరికొందరు పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం బారినపడి అనారోగ్యానికి గురవుతున్నారు. షాద్‌నగర్ : రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో, జిల్లాకు ముఖద్వారంలో ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, ఫరూఖ్‌నగర్ మండలాల్లో సుమారు 156 పరిశ్రమలు ఉన్నట్లు సంబంధితశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 90భారీ, 66 మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ప్లాస్టిక్, వస్త్రతయారీ, గృహోపకరణాలు, ఐరన్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 90శాతం కాలుష్యం వెదజల్లే పరిశ్రమలే ఉన్నాయి. వీటిలో దే శంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 18వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. పొట్టచేత పట్టుకుని బతుకుదెరువు కోసం జిల్లాకు వచ్చిన ఒ డిశా, చత్తీస్ఘడ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువగా రోజువారీగా కూ లీ రూ.150 నుంచి రూ.200 పొం దుతున్న వారే 80శాతం మంది ఉన్నారు. అయితే పరిశ్రమల్లో కార్మికులు యంత్రాల వద్ద పనిచేసే సమయం లో రక్షణ పరికరాలు ధరించాల్సి ఉంది. హెల్మెట్, హ్యాండ్‌గ్లౌస్, కం టి అద్దాలు, షూస్ పరిశ్రమల యా జమాన్యం సరఫరా చేయాలి. కానీ ఇవి మచ్చుకైనా కనిపించడం లేదని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు. ఈ పరికరాలు ఉంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం సంభవించినప్పుడు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కూడా అందుబాటులో లేవని చెబుతుండటం చూస్తే.. పరిశ్రమల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా పరిశ్రమల యజమానులు లాభర్జనే ధ్యేయంగా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని పలువురు నేతలు పెదవివిరుస్తున్నారు. మృత్యువాత పడుతున్న కార్మికులు షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో యజమానుల నిర్లక్ష్యం వల్ల కార్మికులు మృత్యువాత పడుతున్నారు. కార్మికులకు సరైన రక్షణ పరికరాలు అందచేయక పోవడంతో వారు నిత్యం మృత్యువుతో చెలగాటమాడాల్సి వస్తోంది. మూడేళ్ల కాలంలో సుమారు 38మంది కార్మికులు మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత డిసెంబర్లో కొత్తూరు మండలం తీగాపూర్ శివారులో ఉన్న ఓ పరిశ్రమలో టైర్ల బాయిలర్ పేలి ముగ్గురు కార్మికులు మృత్యువాతపడ్డారు. ఇదే మండలంలోని రాయలసీమ ఇండస్ట్రీస్‌లో యంత్రం మీదపడి ఓ కార్మికుడు ప్రాణాలు విడిచాడు. పక్షం రోజుల వ్యవధిలో ఇదే పరిశ్రమలో మరుగుతున్న ఇనుపద్రవం మీదపడి మరో కార్మికుడు చనిపోయాడు. జనవరిలో వీర్లపల్లి గ్రామ శివారులో ఉన్న మహాశివశక్తి పరిశ్రమలో యంత్రం వద్ద పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఇనుపద్రవం మీదపడి మృతిచెందాడు. ఈ పరంపరలో ఈనెల 7న కొత్తూరు మండలంలోని వీర్లపల్లి గ్రామశివారులో ఉన్న స్లెడ్జ్ పరిశ్రమలో బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు రాకేశ్‌కుమార్ శుక్లా(45) యంత్రం బెల్టులో పడి ప్రాణాలు విడిచాడు. నెలకు ఒకసారైనా పరిశ్రమలను తనిఖీచేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే కార్మికులు మృత్యువాత పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా విధిగా పరిశ్రమలను సందిర్శించి అటూ కార్మికులు, ఇటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ప్రైవేటు బస్సుల వేగానికి బ్రేకులు!
షాద్‌నగర్, న్యూస్‌లైన్ : ఇటీవల కొత్తకోట మండలం పా లెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అ ప్రమత్తమయ్యారు. పలు ప్రయివేటు బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 1 నుంచి 26వ తేదీ వరకు 129 బస్సులపై దాడులు నిర్వహించారు. వీటి లో 62 బస్సులను స్వాధీనపరచుకుని కేసులు నమోదు చే శారు. ముఖ్యంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ ర హదారిపై రవాణాశాఖ అధికారులు విస్తృత తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆర్టీఏ కిష్టయ్య, షాద్‌నగర్ ఎంవీఐ నాగరాజు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా జీఎంఆర్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు నిర్వహించిన తనిఖీలో 19 బస్సులను సీజ్ చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆర్టీఏ తెలిపారు. అందుకే విస్తృత తనిఖీలను చేపట్టామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు ప్రయివేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝు లిపించడంతో ప్రయాణికులు పలు ఇక్కట్లకు గురవుతున్నారు. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటామని భావించినా ఆర్టీఏ అధికారుల దాడులతో ప్రయాణికులను ప్రయివేటు బస్సు డ్రైవర్లు రోడ్డు మీదే వదిలి వేస్తున్నారు. దీంతో వారు ఇతర వాహనాల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తోంది. ఏదిఏమైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు బస్సులపై చర్యలు తీసుకోవడం శుభపరిణామని చెబుతున్నారు. కఠిన చర్యలు తప్పవు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్రయివేటు బస్సులపై కేసులు నమోదు చేస్తున్నాం. వీటితోపాటు కార్లు, జీపుల వంటి వాహనాలపైనా దృష్టి సారించాం. ఎవరైనా నిబంధనలు పాటించకుండా వాహ నాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. - నాగరాజు, ఎంవీఐ, షాద్‌నగర్ -
టో(తో)లు తీసుడే!
షాద్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: ఇక రోడ్డెక్కితే తో(టో)లు తీసుడే..హైవేపైకి వా హనం తీసుకెళ్తే జేబులు ఖాళీ కానున్నా యి. జాతీయ రహదారుల మీదుగా వెళ్లేం దుకు చెల్లించే టోల్‌చార్జీలు మరింత పెరగనున్నాయి. ఈ ధరలు సెప్టెంబర్ 1వ తే దీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులపై మరింత భారం పడనుంది. చార్జీలు పెంచనున్నట్లు టోల్‌ప్లా జా నిర్వహకులు తె లిపారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్ నుంచి జడ్చర్ల వ రకు సుమారు 58కిలోమీటర్ల మేర గల జాతీయ రహదారిని జీఎంఆర్ సంస్థ రూ.600కోట్ల వ్యయంతో విస్తరించి అవసరమైనచోట బైపాస్‌రోడ్డును నిర్మించింది. ఈ రహదారి 2009లో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం 44వ జాతీ య రహదారిపై కారు, జీపు, వ్యాన్ ఒక్కసారి ప్రయాణానికి రూ.53, రానుపోను ప్ర యాణానికి రూ.80, లైట్ కమర్షియల్ వా హనం ఒక్కసారి ప్రయాణానికి రూ.93, రా నుపోను ప్రయాణానికి రూ.140, లోకల్ క మర్షియల్ వాహనానికి రూ.15, ట్రక్కు, బ స్సు ఒక్కసారి ప్రయాణానికి రూ.186, రా నుపోను ప్రయాణానికి రూ.280, లోకల్ క మర్షియల్ వాహనానికి రూ. 25, మల్టీ యాక్సిల్ వాహనం ఒక్కసారి ప్రయాణానికి రూ.300, రానుపోను ప్రయాణానికి రూ. 449, స్కూల్ బస్సులకు నెలవారీగా రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ఇక ఈ ధరలు పూర్తిగా మారనున్నాయి. పెరగనున్న చార్జీలు ప్రతి ఏడాది ఈ ఏటా కూడా టోల్గేట్ చార్జీలను పెంచినట్లు నిర్వహకులు తెలి పారు. కారు, జీపు, వ్యాన్ ఒక్కసారి ప్ర యాణానికి రూ.56, రానుపోను ప్రయాణానికి రూ.84, లైట్ కమర్షియల్ వాహనం ఒ క్కసారి ప్రయాణానికి రూ.98, రానుపోను ప్రయాణానికి రూ.148, లోకల్ కమర్షియల్ వాహనానికి రూ.15, ట్రక్కు, బస్సు ఒక్కసా రి ప్రయాణానికి రూ.197, రానుపోను ప్ర యాణానికి రూ.295, లోకల్ కమర్షియల్ వాహనానికి రూ.25, మల్టీ యాక్సిల్ వా హనం ఒక్కసారి ప్రయాణానికి రూ.316, రానుపోను ప్రయాణానికి రూ.475, స్కూల్ బస్సులకు నెలవారీగా రూ.వెయ్యి వసూ లు చేయనున్నారు. అదేవిధంగా కారు, జీపు, వ్యాన్ నెలసరిపాసు రూ.1688, లైట్ కమర్షియల్ వాహనం నెలసరి పాసు రూ. 2953, ట్రక్కు, బస్సు నెలసరి పాసు రూ.5907, మల్టీ యాక్సిల్ వాహనం నె లసరి పాసు రూ.9493 వసూలు చేయనున్నారు. ఈ పెంచిన ధరలను 31 ఆగస్టు 2014 వరకు వసూలు చేయనున్నట్లు టో ల్గేట్ యాజమాన్య సంస్థ ప్రకటించింది. షాద్‌నగర్ సమీపంలోని టోల్‌ప్లాజాలో ప్రతిరోజు మూడువేల నుంచి నాలుగు వే ల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సుమారు రూ.13లక్షల టో ల్రుసుం వసూలవుతుందని నిర్వాహకు లు తెలిపారు. చార్జీలు పెంచడం మూ లంగా అదనంగా మరో రూ.50వేలు వసూ లు కావచ్చని ప్రకటించారు. శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద అడ్డాకుల: శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 31వ తేదీ నుంచి అ మల్లోకి రానున్నాయి. పెంచిన టోల్‌చార్జీ ల వల్ల ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల పై కూడా భారం పడనుంది. అదేవిధంగా నిత్యవసర వస్తువుల ధరలు కూ డా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరగనున్న చార్జీలు రూ.3 నుంచి రూ.24 వ రకు వాహనాల స్థాయిని బట్టి అమలుచేస్తారు. ఇదిలా ఉండగా టోల్‌ప్లాజా వద్ద చార్జీలను పెంచుతున్నప్పటికీ ప్రమాదా ల నివారణపై మాత్రం అధికారులు దృష్టిసారించడం లేదు. హైవే పక్కన ఉన్న గ్రా మాల్లో ఇప్పటికీ సరైన సర్వీసు రోడ్డు వ సతి కల్పించలేదు. దీనివల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయని వాహనచోదకులు వాపోతున్నారు. -
రెండు బైకులు ఢీకొని ముగ్గురి దుర్మరణం
షాద్‌నగర్ టౌన్, న్యూస్‌లైన్: రోడ్డు ములుపులో అ తివేగంతో వచ్చిన రెండు బై కులు ఢీకొనడంతో ము గ్గురు మృత్యువాతపడ్డారు. ఈ వి షాదకర సంఘటన బుధవా రం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కొందుర్గు మండలం ఆ గిర్యాల గ్రామానికి చెందిన సురేష్(20), సంతోష్, గఫార్ ము గ్గురు స్నేహితులు. సురేష్ షాద్‌నగర్ పట్టణంలోని బీఏఎం డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం స్నేహితులు ముగ్గురు కలిసి బైక్‌పై షాద్‌నగర్ పట్టణానికి వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు మూల మలుపులో కిషన్‌నగర్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తున్న మరో ైబె క్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై వెళ్తున్న వెంకటయ్య(40),గంగాధర్(40)లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి త రలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వెంకటయ్య మృతిచెందాడు. గం గాధర్ను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృ తి చెందాడు. వెంకటయ్య, గంగాధర్‌ను కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతవాసిగా పోలీసులు గుర్తించారు. షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి సీఐ సైదయ్య చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి బంధువుల రోదనలు పలువురి కంటతడి పెట్టించాయి. మృతుడు వెంకటయ్య, గంగాధర్ గ్రామాల్లో చెట్లను కొనుగోలు చేసి, వాటిని కాల్చగా వచ్చిన బొగ్గును విక్రయించి జీవనం కొనసాగించేవారు.