షాద్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: ఇక రోడ్డెక్కితే తో(టో)లు తీసుడే..హైవేపైకి వా హనం తీసుకెళ్తే జేబులు ఖాళీ కానున్నా యి. జాతీయ రహదారుల మీదుగా వెళ్లేం దుకు చెల్లించే టోల్‌చార్జీలు మరింత పెరగనున్నాయి. ఈ ధరలు సెప్టెంబర్ 1వ తే దీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులపై మరింత భారం పడనుంది. చార్జీలు పెంచనున్నట్లు టోల్‌ప్లా జా నిర్వహకులు తె లిపారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్ నుంచి జడ్చర్ల వ రకు సుమారు 58కిలోమీటర్ల మేర గల జాతీయ రహదారిని జీఎంఆర్ సంస్థ రూ.600కోట్ల వ్యయంతో విస్తరించి అవసరమైనచోట బైపాస్‌రోడ్డును నిర్మించింది.
ఈ రహదారి 2009లో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం 44వ జాతీ య రహదారిపై కారు, జీపు, వ్యాన్ ఒక్కసారి ప్రయాణానికి రూ.53, రానుపోను ప్ర యాణానికి రూ.80, లైట్ కమర్షియల్ వా హనం ఒక్కసారి ప్రయాణానికి రూ.93, రా నుపోను ప్రయాణానికి రూ.140, లోకల్ క మర్షియల్ వాహనానికి రూ.15, ట్రక్కు, బ స్సు ఒక్కసారి ప్రయాణానికి రూ.186, రా నుపోను ప్రయాణానికి రూ.280, లోకల్ క మర్షియల్ వాహనానికి రూ. 25, మల్టీ యాక్సిల్ వాహనం ఒక్కసారి ప్రయాణానికి రూ.300, రానుపోను ప్రయాణానికి రూ. 449, స్కూల్ బస్సులకు నెలవారీగా రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ఇక ఈ ధరలు పూర్తిగా మారనున్నాయి.
పెరగనున్న చార్జీలు
ప్రతి ఏడాది ఈ ఏటా కూడా టోల్‌గేట్ చార్జీలను పెంచినట్లు నిర్వహకులు తెలి పారు. కారు, జీపు, వ్యాన్ ఒక్కసారి ప్ర యాణానికి రూ.56, రానుపోను ప్రయాణానికి రూ.84, లైట్ కమర్షియల్ వాహనం ఒ క్కసారి ప్రయాణానికి రూ.98, రానుపోను ప్రయాణానికి రూ.148, లోకల్ కమర్షియల్ వాహనానికి రూ.15, ట్రక్కు, బస్సు ఒక్కసా రి ప్రయాణానికి రూ.197, రానుపోను ప్ర యాణానికి రూ.295, లోకల్ కమర్షియల్ వాహనానికి రూ.25, మల్టీ యాక్సిల్ వా హనం ఒక్కసారి ప్రయాణానికి రూ.316, రానుపోను ప్రయాణానికి రూ.475, స్కూల్ బస్సులకు నెలవారీగా రూ.వెయ్యి వసూ లు చేయనున్నారు.
అదేవిధంగా కారు, జీపు, వ్యాన్ నెలసరిపాసు రూ.1688, లైట్ కమర్షియల్ వాహనం నెలసరి పాసు రూ. 2953, ట్రక్కు, బస్సు నెలసరి పాసు రూ.5907, మల్టీ యాక్సిల్ వాహనం నె లసరి పాసు రూ.9493 వసూలు చేయనున్నారు. ఈ పెంచిన ధరలను 31 ఆగస్టు 2014 వరకు వసూలు చేయనున్నట్లు టో ల్‌గేట్ యాజమాన్య సంస్థ ప్రకటించింది. షాద్‌నగర్ సమీపంలోని టోల్‌ప్లాజాలో ప్రతిరోజు మూడువేల నుంచి నాలుగు వే ల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సుమారు రూ.13లక్షల టో ల్‌రుసుం వసూలవుతుందని నిర్వాహకు లు తెలిపారు. చార్జీలు పెంచడం మూ లంగా అదనంగా మరో రూ.50వేలు వసూ లు కావచ్చని ప్రకటించారు.
శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద
అడ్డాకుల: శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 31వ తేదీ నుంచి అ మల్లోకి రానున్నాయి. పెంచిన టోల్‌చార్జీ ల వల్ల ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల పై కూడా భారం పడనుంది. అదేవిధంగా నిత్యవసర వస్తువుల ధరలు కూ డా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం పెరగనున్న చార్జీలు రూ.3 నుంచి రూ.24 వ రకు వాహనాల స్థాయిని బట్టి అమలుచేస్తారు. ఇదిలా ఉండగా టోల్‌ప్లాజా వద్ద చార్జీలను పెంచుతున్నప్పటికీ ప్రమాదా ల నివారణపై మాత్రం అధికారులు దృష్టిసారించడం లేదు. హైవే పక్కన ఉన్న గ్రా మాల్లో ఇప్పటికీ సరైన సర్వీసు రోడ్డు వ సతి కల్పించలేదు. దీనివల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయని వాహనచోదకులు వాపోతున్నారు.
టో(తో)లు తీసుడే!
Published Fri, Aug 30 2013 3:58 AM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM
Advertisement
Advertisement