Minister KTR Satirical Tweet On Amit Shah: అమిత్‌ షా వచ్చింది అందుకు కాదా?.. కేటీఆర్‌ సెటైర్లు - Sakshi
Sakshi News home page

అమిత్‌ షా వచ్చింది అందుకు కాదా?.. కేటీఆర్‌ సెటైర్లు

Published Sun, Apr 23 2023 8:47 PM | Last Updated on Mon, Apr 24 2023 11:10 AM

Minister KTR Political Satire On Amit Shah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం హీటెక్కింది. చేవెళ్లలో బీజేపీ తలపెట్టిన విజయ సంక్పల సభకు కేంద్ర హో​ం మంత్రి అమిత్‌ షా విచ్చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ సర్కార్‌పై సంచలన కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, అమిత్‌ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘ఐటీఐఆర్‌ హైదరాబాద్‌, పాలమూరు లిప్ట్‌ ఇరిగేషన్‌కు జాతీయ హోదా, హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ, ఎన్‌ఐడీ, నవోదయ, మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలల శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని అనుకున్నా. అమిత్‌ షా వచ్చింది అందుకు కాదా?. గత తొమ్మిదేళల్లో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ రాష్ట్రం పేరు ఎందుకు చెప్పలేదు. అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement