ఒకదానికొకటి మూడు లారీల ఢీ | cleaner dead in lorry accident | Sakshi
Sakshi News home page

ఒకదానికొకటి మూడు లారీల ఢీ

Published Mon, Jan 29 2018 10:40 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

cleaner dead in lorry accident - Sakshi

క్లీనర్‌ రమేష్‌ మృతదేహం

గుడ్లూరు: మూడు లారీలు ఒక దానికొకటి ఢీకొనడంతో ఓ లారీ క్లీనర్‌ మృతి చెందగా ఇద్దరు డ్రైవర్లుకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై చేవూరు జంక్షన్‌ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న లారీని చేవూరు వద్దకు వచ్చే సరికి వెనుకనే వస్తున్న మరో లారీ ఓవర్‌ టేక్‌ చేయబోయి అదుపుతప్పి ఢీకొట్టింది. అదే సమయంలో వెనుకనే వస్తున్న మరో లారీ మధ్యలో లారీని వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మధ్య లారీ డోరు ఊడి పోవడంతో క్లీనర్‌ రమేష్‌ (35) ఎగిరి రోడ్డుపై పడి తల పగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడి. డ్రైవర్‌ శ్రీనివాసులు, వెనుక లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ నిలిచి పోయింది.

సమాచారం అందుకున్న హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తమ వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. క్లీనర్‌ రమేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడి రమేష్‌ది విశాఖపట్నంలోని చిలకపేట గ్రామం. సంఘటన స్థలాన్ని ఇన్‌చార్జి ఎస్‌ఐ రమణయ్య, గుడ్లూరు పోలీసుస్టేషన్‌ రైటర్‌ డానియేలు పరిశీలించి వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement