భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.
ఇంట్లోకి దూసుకెళ్ళిన లారీ
Published Thu, Sep 7 2017 1:28 PM | Last Updated on Tue, Sep 12 2017 2:10 AM
- తప్పిన పెనుప్రమాదం
విజయవాడ: భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన విజయవాడలోని రాజీవ్ నగర్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. రాజీవ్ నగర్ రోడ్‌లో వెళ్తున్న లారీని డ్రైవర్ మలుపు తిప్పే ప్రయత్నంలో అదుపతప్పి ఇంటి ప్రహరిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ప్రహరీ వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ప్రహరీ సమీపంలోని ఒక మోటార్ వాహనం, 4 సైకిళ‍్లు ధ్వంసం అయ్యాయి. లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement