![Diesel Tanker Accident in Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/25/diesel.jpg.webp?itok=OGUka9c0)
సంఘటన స్థలంలో డీజిల్ ట్యాంకర్
పీఎం పాలెం(భీమిలి): జాతీయ రహదారిపై మారికివలస కూడలిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు రూ.8లక్షలు విలువ చేసే డీజిల్ నేలపాలయింది. షీలానగర్‌కు చెందిన ట్యాంకర్ 18 వేల లీటర్ల డీజిల్‌తో ఆదివారం ఒడిశాకు బయలుదేరింది. జాతీయ రహదారి మారికవలస కూడలి వద్దకు వచ్చేసరికి కూడలిలో యూ టర్న్ తిరుగుతున్న భారీ కంటెయినర్ డీజిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టొంది. దీంతో ట్యాంకర్ బోల్తా కొట్టింది. ట్యాంకరుకు గల బ్లాకుల మూతలు తెరుచుకోవడంతో ఆయిల్ రోడ్డుపై ఏరులా పారింది. సందట్లో సడేమియా అన్నట్లు స్థానికులు రోడ్డుపై పారుతున్న డీజిల్‌ను చేతికి అందినంత డబ్బాలతో పట్టుకుపోయారు. నేల పాలైన ఆయిల్ విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని సిబ్బంది తెలిపారు. లారీ యజమాని సాధి సూరిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు రమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.సూర్యారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment