సత్యనారాయణ, నాగరాణి మృతదేహాలు
రసూల్‌పురా: ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండుప్రాణాలను బలిగొంది. నిద్రిస్తున్న దంపతులపై రివర్స్‌లో లారీని ఎక్కించడంతో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి జరిగింది. బోయిన్‌పల్లి సీఐ విజయ్‌కుమార్ అందించిన వివరాల మేరకు..సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని సింగానిగూడెంకు చెందిన సత్యనారాయణ (55) నాగరాణి (50) దంపతులు బోయనపల్లి హర్షవర్థన్ కాలనీలో మాజీ డిప్యూటీ కలెక్టర్ సీతారాంరెడ్డి నివాసంలో ఉంటూ అక్కడే పనిచేస్తున్నారు.
మంగళవారం రాత్రి బాగ ఉక్కపోత ఉండడంతో ఇంటి ముందు రోడ్డుపై పడుకున్నారు.కాగా అర్థరాత్రి గడచిన తర్వాత సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఇంటి వద్దకు కంకరను అన్‌లోడ్ చేసేందుకు వచ్చిన లారీ రివర్స్‌లో వీరిపైకి దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు బుధవారం ఉదయం బోయిన్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు, లారీ సమాచారం కోసం కాలనీలోని సీసీ ఫుటేజీలను పరీశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment