old couples
-
నలిగిన బతుకులు
రసూల్‌పురా: ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండుప్రాణాలను బలిగొంది. నిద్రిస్తున్న దంపతులపై రివర్స్‌లో లారీని ఎక్కించడంతో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి జరిగింది. బోయిన్పల్లి సీఐ విజయ్‌కుమార్ అందించిన వివరాల మేరకు..సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని సింగానిగూడెంకు చెందిన సత్యనారాయణ (55) నాగరాణి (50) దంపతులు బోయనపల్లి హర్షవర్థన్ కాలనీలో మాజీ డిప్యూటీ కలెక్టర్ సీతారాంరెడ్డి నివాసంలో ఉంటూ అక్కడే పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి బాగ ఉక్కపోత ఉండడంతో ఇంటి ముందు రోడ్డుపై పడుకున్నారు.కాగా అర్థరాత్రి గడచిన తర్వాత సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఇంటి వద్దకు కంకరను అన్లోడ్ చేసేందుకు వచ్చిన లారీ రివర్స్‌లో వీరిపైకి దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు బుధవారం ఉదయం బోయిన్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు, లారీ సమాచారం కోసం కాలనీలోని సీసీ ఫుటేజీలను పరీశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్య
వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రికి చెంది న ఏడుమేకల నర్సయ్య(69), మల్లవ్వ(64) దంపతులు శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వాసంపల్లికి చెందిన నర్సయ్య, మల్లవ్వలు.. మల్లవ్వ పుట్టినిల్లు అయిన నూకలమర్రికి 35 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడ్డారు. కూలీ పని చేసుకుంటూ జీవించేవారు. వీరికి సంతానం లేదు. వయస్సు మీద పడిన క్రమంలో రేషన్ బియ్యం, ఆసరా పింఛన్‌తో సొంత ఇంట్లో ఉంటున్నారు. నాలుగేళ్ల కిందట మల్లవ్వ అనారోగ్యం బారిన పడింది. కడుపునొప్పితో బాధపడింది. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా గర్భసంచి ఆపరేషన్ చేశారు. మూడేళ్ల క్రితం మళ్లీ మల్ల వ్వ కిడ్నీలకు సంబంధించిన వ్యాధి బారిన పడింది. వెన్నుపూస నొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం నయంకాలేదు. మంచానికి పరిమితమైంది. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించింది. నర్సయ్యే ఆమెకు సపర్యలు చేసేవాడు. కూలీ పనులు చేసినా ఆమె మందులకు డబ్బులు సరిపోవ డం లేదు. ఈ క్రమంలో మనోవేదనకు గురైన నర్సయ్య.. మల్లవ్వలు ఇంట్లోనే పురుగుల మందుతాగారు. శనివారం ఉదయం తొమ్మి దైనా.. దంపతులు తలుపులు తీయకపోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. విగతజీవులుగా కనిపించారు. పక్కనే క్రిమిసంహారక మందు డబ్బా ఉంది. వేములవాడ పోలీసులకు సమాచారం అందించారు. వేములవాడ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీ వెంటే నేను..
- ఒకే రోజు వృద్ధ దంపతుల మృతి - అనారోగ్యంతో వృద్ధుడి మృతి - పది గంటల వ్యవధిలో గుండెపోటుతో వృద్ధురాలి మరణం పగిడ్యాల: ఏడడుగుల బంధంతో మొదలైన వారి బంధం మరణంలోనూ వీడ లేదు. తోడు నీడగా దాదాపు 60 సంవత్సరాల కొనసాగిన వారి జీవన ప్రయాణం గురువారంతో ముగిసింది. పడమర ప్రాతకోట గ్రామానికి చెందిన దేవరాజు (80), దానమ్మ (70) దందపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా దేవరాజు అనారోగ్యనికి గురయ్యాడు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కోలుకోలేక ఇంటి వద్దనే మృతి చెందాడు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల తర్వాత దానమ్మ గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. పది గంటల వ్యవధిలో భార్యభర్తలు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుమకుంది. -
ఎల్బీనగర్లో దొంగల బీభత్సం, దంపతుల హత్య
హైదరాబాద్: నగరంలో దుండగుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లడం, ఆపై అడ్డుకున్నవారిని అతిదారుణంగా హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో ఏదో చోట నిత్యం వెలుగుచూస్తునే ఉన్నాయి. తాజాగా ఎల్బీనగర్లో సాయినగర్‌లో బుధవారం దొంగలు సృష్టించిన బీభత్సానికి వృద్ధ దంపతులు బలైయ్యారు. ఆ దంపతుల ఇంట్లోకి పోలీసులమంటూ నలుగురు దుండగులు ప్రవేశించి విచక్షణ లేకుండా దారుణంగా హత్యచేశారు. దంపతులను హత్యచేసిన వారిలో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, వారిలో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం.