హైదరాబాద్: నగరంలో దుండగుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లడం, ఆపై అడ్డుకున్నవారిని అతిదారుణంగా హతమారుస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో ఏదో చోట నిత్యం వెలుగుచూస్తునే ఉన్నాయి.
తాజాగా ఎల్బీనగర్‌లో సాయినగర్‌లో బుధవారం దొంగలు సృష్టించిన బీభత్సానికి వృద్ధ దంపతులు బలైయ్యారు. ఆ దంపతుల ఇంట్లోకి పోలీసులమంటూ నలుగురు దుండగులు ప్రవేశించి విచక్షణ లేకుండా దారుణంగా హత్యచేశారు. దంపతులను హత్యచేసిన వారిలో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, వారిలో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం.
ఎల్బీనగర్‌లో దొంగల బీభత్సం, దంపతుల హత్య
Published Wed, Oct 23 2013 10:10 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement
Advertisement