లారీ ఢీకొని యువకుడి దుర్మరణం | man dies of lorry accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

Published Fri, Apr 7 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

man dies of lorry accident

కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లు మండలం పెనకలపాడులో గురువారం రాత్రి లారీ ఢీకొని అదే గ్రామానికి చెందిన కృష్ణమోహన్‌(30) మృతి చెందినట్లు ఎస్‌ఐ యువరాజు తెలిపారు. కృష్ణమోహన్‌ తన స్నేహితులతో కలసి మల్లికార్జున ఇంటి వద్ద మాట్లాడుకొంటూ నిలబడి ఉండగా లారీ విపరీతమైన వేగంతో అతనిపై దూసుకెళ్లిందన్నారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. లారీ డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ఘటన జరిగిందని పేర్కొన్నారు.  మృతుని భార్య లలితమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement