డివైడర్ మధ్యలో చిక్కుకున్న లారీ, క్లీనర్ వెంకటేశ్వర్లు మృతదేహం
జె.పంగులూరు: ఫ్లై ఓవర్‌పై లారీ డివైడర్‌ను ఢీకొనడంతో క్లీనర్ దుర్మరణం చెందగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం ముప్పవరం జాతీయ రహదారిపై గురువారం జరిగింది. విజయవాడ నుంచి కడపకు రిలయన్స్‌కు సంబంధించిన టవర్ సామగ్రితో లారీ బయల్దేరింది. ముప్పవరంలోని ఫ్లై ఓవర్‌పైకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. డివైడర్‌ను లారీ బలంగా ఢీకొనడంతో రెండు బ్రిడ్జిల మధ్య ఇరుక్కుపోయింది. ప్రమాదంలో క్లీనర్ బండి వెంకటేశ్వర్లు (22) రెండు బ్రిడ్జిల మ«ధ్య జారి పడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ బండి సుబ్బారాయుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్లీనర్, డ్రైవర్ స్వగ్రామం వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం భద్రపల్లి గ్రామం. రేణింగవరం ఎస్‌ఐ అజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment