విలేకరులతో మాట్లాడుతున్న కాంతరాజు, వెంకటస్వామి
సాక్షి, మడకశిర: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మడకశిరకు వస్తున్న సీఎం చంద్రబాబుకు ఆ పార్టీలోని ప్రముఖ నాయకులు బిగ్‌షాక్ ఇచ్చారు. అమరాపురం మండలం హల్కూ రు గ్రామానికి చెందిన తెలుగు యువత జిల్లా కార్యదర్శి కాంతరాజు మంగళవారం మడకశిరలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వైఎస్.జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్న ట్లు తెలిపారు. అదేవిధంగా అగళి మండలానికి చెం దిన ప్రముఖ టీడీపీ నేత వెంకటస్వామి కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. బుధవారం చంద్రబాబు వస్తుంటే మంగళవారం వీళ్లిచ్చిన షాక్ నుంచి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ అభ్యర్థి ఈరన్న కోలు కోలేకున్నారు. ఎందుకంటే కాంతరాజు, వెంకటస్వామి నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకులు.
- కాంతరాజు నియోజకవర్గంలో 70వేల మంది ఓటర్లున్న వక్కలిగ సామాజికవర్గానికి చెందినవారు. వక్కలిగ సంఘం గౌరవ అధ్యక్షుడిగానూ పని చేస్తున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లోనూ ఆయనకు మంచి పట్టుంది. ముఖ్యంగా యువతలో మంచి పలుకుబడి ఉంది.
- అగళి మండలానికి చెందిన వెంకటస్వామి దళిత నాయకుడు. 1983 నుంచి టీడీపీలో ఉన్నారు. ఎ మ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పలుసార్లు ముఖ్యమంత్రి ని కలిసి కోరినా ఫలితం లేదు. అయినప్పటికీ పార్టీ కోసం కష్టపడి పని చేశారు. ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నప్పటికీ పార్టీలో గౌరవం లభించలేదు. ఆ ఆవేదనతోనే టీడీపీకి గుడ్‌బై చెప్పారు.
- కొత్తగా వచ్చిన నాయకులు టీడీపీని సర్వనాశనం చేస్తున్నారు: కాంతరాజు
హల్కూరు కాంతరాజు టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుం చి వచ్చిన కొంతమంది కాంట్రాక్ట్ పనుల కోసం టీ డీపీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 1983 నుంచి ఉన్న నాయకులకు తీవ్ర అన్యాయం జరగుతోందన్నారు. కొత్తగా వచ్చిన వారిపై టీడీపీలో భా రీ అసంతృప్తి ఉందన్నారు. చాలామంది బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తనకు పార్టీలో గౌరవం లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరతానని తెలిపారు.
టీడీపీ ప్రభుత్వంలోనే కష్టాలు అనుభవించా : వెంకటస్వామి
వెంకటస్వామి టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తాను పార్టీలో సీనియర్ నాయకుడిని అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వంలోనే కష్టాలు అనుభవించానని ఆవేదన చెందారు. తాను సర్పంచుగా, ఎంపీటీసీగా ప్రజలకు న్యాయం చేయలేకపోయానని విచారం వెలిబుచ్చారు. కొత్తగా వచ్చిన నేతలు పార్టీకి చీడ పురుగులుగా మారారని ఆరోపించారు. తాను 1983 నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వచ్చినా గౌరవం లభించలేదన్నారు. అనుచరులతో చర్చించి త్వరలోనే 1,000 మందితో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశం
టీడీపీకి రాజీనామా చేసిన ప్రముఖ నాయకులు కాంతరాజు, వెంకటస్వామి వెంటనే మాజీ ఎమ్మె ల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామితో సమావేశమై ఆ పార్టీలో చేరే విషయమై చర్చించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment