
హుస్సేన్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
రైతులకు అండగా ఉంటామని, వారిలో స్థైర్యం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది
అనంతపురం: రైతులకు అండగా ఉంటామని, వారిలో స్థైర్యం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర నాలుగోరోజు గురువారం వైఎస్ జగన్ గుంతకల్లు మండలంలో పర్యటించారు. వైఎస్ జగన్ కు గుంతకల్లులో కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
ఉదయం గుంతకల్లు నుంచి ప్రారంభమైన యాత్ర నల్లదాసరపల్లికి చేరుకుంది. నల్లదాసరిపల్లి గ్రామంలోని హుస్సేన్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసాయిచ్చారు. మంచిరోజులు వస్తాయి. అప్పటివరకూ దైర్యంగా ఉండండని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం తిమ్మాపురం గ్రామానికి వెళ్లి రైతు పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం డ్వాక్రా సభ్యులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి ఉరవకొండ నియోజక వర్గంలో యాత్ర కొనసాగనుంది.